Congress Vs BRS: అంతా వన్ సైడ్ అనుకున్న నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీన్ రివర్స్ అయ్యిందటా.. రెండేళ్ల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ, ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉండటంతో పంచాయతీల్లో మెజార్టీ స్థానాలు తమకే తధ్యం అనుకున్న కాంగ్రెస్ శ్రేణుల ఆశలకు గండి పడిందంట .. అధికారంలో ఉండి కూడా సర్పంచ్ అభ్యర్థి దొరకపోవడం, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి సర్పంచ్‌గా ఏకగ్రీవం కావడం చర్చనీయాంశంగా మారిందిక్కడ.. ఇద్దరు ప్రజాప్రతినిధుల ఆశలకు రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారు వెన్నుపోటు పొడవడంతో రిజల్ట్ తలకిందులైందంట.. అసలు నాగర్‌కర్నూల్ పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగింది?
కాంగ్రెస్‌కు డేంజర్ బెల్ మోగించిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు
నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ సెగ్మెంట్లో స్థానిక సంస్థల ఎన్నికలలో మొదటి, 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్ మోగించాయి.. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీగా కుచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే గా డాక్టర్ కుచుకుళ్ళ రాజేష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. గతంలో బీఆర్ఎష్ అభ్యర్థిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో కొనసాగే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన పార్టీ మారే విషయమై ఆలోచనలో పడ్డారంట.
సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి ఎదుగు, బొదుగు లేని కాంగ్రెస్
ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉండి నాగర్‌కర్నూల్ సెగ్మెంట్లో ఆ పార్టీకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉండి ప్రభుత్వ పథకాల గురించి ఊదరగొడుతున్నా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే సర్పంచి ఎన్నికల ఫలితాలలో ఎలాంటి ఎదుగుదల లేకుండా గొర్రెతోక బెత్తడే అన్న చందంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది.. నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు , లీడర్ నుండి కేడర్ వరకు కకావికలమవుతున్నా గులాబీ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ తగ్గకపోవడం కాంగ్రెస్ శ్రేణులను కలవరపరుస్తోందంట.
అధికార పార్టీకి దొరకని సర్పంచ్ అభ్యర్థులు
నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్, బిజినాపల్లి ,తిమ్మాజిపేట, తాడూరు, తెలకపల్లి మండలాలున్నాయి. అందులో 131 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 71 మంది గెలుపొందగా బీఆర్ఎస్ హాఫ్ సెంచరీ కొట్టి అధికార పార్టీకి సవాల్ విసిరింది.. తాడూరు మండలం ఎట్టిదర్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి కవిత అర్జున్, బిజినపల్లి మండలం రాంరెడ్డిపల్లి తండా సర్పంచ్‌గా ఆ పార్టీ అభ్యర్థి పట్లవత్ సాలి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఆ పంచాయతీల్లో అధికార పార్టీకి సర్పంచ్ అభ్యర్థి దొరకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ఎమ్మెల్యే స్వగ్రామంలో అతికష్టం మీద గెలిచిన కాంగ్రెస్
ఇక సెగ్మెంట్లో బీజేపీ మూడు స్థానాల్లో , సిపిఐ ఒక స్థానంలో గెలుపొందగా స్వతంత్రులు ఆరుగురు గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్వగ్రామం తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానం మీసాల లక్ష్మి సహావార్డ్ మెంబర్ల దాకా క్లీన్ స్వీట్ చేసింది. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూల్ మండలం తుడుకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మమ్మ కర్ణాకర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిపై అతి కష్టం మీద గట్టెక్కారు. మొత్తం మీద బీఆర్ఎస్‌కి గ్రామీణ స్థాయి ప్రజల్లో ఆదరణ తగ్గలేదన్నది కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి మరింత చొచ్చుకు పోవాల్సిన అవసరం ఉందన్న విషయం ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి..
నియోజకాభివృద్ధికి రూ. 1000 కోట్లు తెచ్చిన ఎమ్మెల్యే
రెండేళ్ల పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి 1000 కోట్ల పైచిలుకు నిధులు అభివృద్ధి కోసం తీసుకొచ్చారు. వాటికి సంబంధించిన కార్యక్రమాలు కొన్ని కొనసాగుతున్నా కొన్నిటికి నేటికి టెంకాయ కొట్టకపోవడం విశేషం.. అదే cc రోడ్ల విషయంపై సర్పంచ్ ఎన్నికల్లో తాడూరు మండలం ఐతోలు గ్రామంలోని కోమటి తండాలో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేని గ్రామస్థులు అడ్డుకున్నారంట.. అభివృద్ధి పథంలో నడిపేందుకు తీసుకొచ్చిన నిధులు మంజూరు విషయం పట్టణ స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు ప్రజలకు చేరవేయడంలో ప్రధాన భూమిక పోషించే పార్టీ సోషల్ మీడియా ఆక్టివ్ గా లేదంట.
Also Read: నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం నిందితుల రిమాండ్.. ఏసీబీ కోర్టులో ఏం జరగబోతోంది?
మొత్తమ్మీద చేస్తున్న అభివృద్ధిపై నాయకులు ప్రచారం చేసుకోకపోవడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పలుచోట్ల ఎదురుదెబ్బ తగిలిందంటున్నారు. దీనికి తోడు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఒక్కరినే పోటీలో పెట్టే విషయంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వైఫల్యం చెందారన్న టాక్ వినిపిస్తుంది… ఒక గ్రామపంచాయతీలో అధికార పార్టీ నుండి ముగ్గురు వరకు పోటీలో దిగడం, అభివృద్ధిని ప్రజలకు చేరవేసే విషయంలో ఫెయిల్ కావడం వల్లే ఈ ఎన్నికల రిజల్ట్ రివర్స్ అయిందంటున్నారు
మున్సిపల్ , ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై క్యాడర్లో గుబులు
నియోజకవర్గంలో ఇప్పటికైన జరుగుతున్న అభివృద్ధిని ప్రజలలోకి తీసుకెళ్లాలని లేకపోతే రానున్న మున్సిపల్ , ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దాని ప్రభావం పడుతుందని క్యాడర్ వాపోతోంది. చ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగితే అధికార పార్టీకి నాగర్‌కర్నూల్‌లో గడ్డు కాలం తప్పదంటున్నారు.
Story By Ajay Kumar, Bigtv