వోక్స్ వ్యాగన్ ఇండియా సరికొత్త మోడల్ కారును దేశీ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. లాంచ్ కు ముందే ఈ మోడల్ కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. టేరాన్ ఆర్ లైన్ SUVని వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. వోక్స్ వ్యాగన్ టేరాన్ ఆర్ లైన్ ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించింది. ఈ SUV దేశంలో కంప్లీట్లీ నాక్డ్ డౌన్ మోడల్ గా సేల్స్ కొనసాగించనుంది. అంటే, దీనిని ఇక్కడికి దిగుమతి చేసుకుని స్థానికంగా అసెంబుల్ చేస్తారు. టేరాన్ ఆర్ లైన్ సెవెన్ సీటర్ SUV దేశంలో వోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ వెహికల్ లైనప్ లో ఫ్లాగ్ షిప్ మోడల్ గా టాప్ ప్లేస్ లో నిలిచే అవకాశం ఉంది. టేరాన్ ఆర్ లైన్ స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్, MG గ్లోస్టర్ లాంటి కార్లతో పోటీ పడనుంది. జర్మన్ ఆటో దిగ్గజం వోక్స్ వ్యాగన్ టేరాన్ ఆర్ లైన్ కు సంబంధించిన పలు వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్ లైన్ కారు గ్లోబల్ SUV డిజైన్ తో వస్తుంది. సూపర్ స్టైలింగ్ అంశాలను కలిగి ఉంటుంది. ముందు, వెనుక భాగంలో అద్భుతమైన వోక్స్ వ్యాగన్ లోగోలను కలిగి ఉంటుంది. రెండు చివర్లలో పెద్ద LED లైట్ సిగ్నేచర్లు, అందమైన IQ లైట్ డ్యూయల్ ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్‌లు, LED టెయిల్ లైట్‌లు ఉన్నాయి. SUV ముందు ఫెండర్‌పై R బ్యాడ్జింగ్, D పోల్స్ మీద కాంట్రాస్ట్ సిల్వర్ ఎలిమెంట్, బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, కొత్త పర్పుల్ పెయింట్ తో వస్తుంది. SUV 19 అంగుళాల డైమండ్ కట్ కోవెంట్రీ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది.
క్యాబిన్ లోపల డాష్‌బోర్డ్ లో మినిమలిస్ట్ విధానాన్ని కలిగి ఉంటుంది. అన్ని కీలకమైన వివరాలతో కూడిన డ్రైవర్ ఫోకస్డ్ 15 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ స్క్రీన్ పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్ అప్ డిస్ ప్లేగా ఉంటుంది. లెదర్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ల కోసం మసాజ్ ఫంక్షన్, పనోరమిక్ సన్‌రూఫ్, 30 కలర్ యాంబియంట్ లైటింగ్, మల్టీ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మ్యాట్రిక్స్ LED ల్యాంప్‌లు ఉన్నాయి. మూడు వరుసల సీట్లు ఉంటాయి. 850 లీటర్ల బూట్ స్టోరేజ్‌ను అందిస్తుంది.
ఇండియాలో లాంచ్ కాబోయే వోక్స్ వ్యాగన్ టేరాన్ R-లైన్ 2.0-లీటర్ TSI EVO టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ను తో కూడిన పవర్ ను అందిస్తోంది. ఇది దాదాపు 201 bhp గరిష్ట శక్తిని, 320 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఏడు స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, వోక్స్ వ్యాగన్ 4MOTION ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. లాంచింగ్ తర్వాత మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
Read Also: ఇండియాలో టాప్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే, ఒక్కోటి ఎంత దూరం వెళ్తాయంటే?