E-Paper
Advertisement

Chamala Kiran Kumar Reddy: ఆధారాలు లేకుండా వార్తలు వద్దు.. జర్నలిస్టుల అరెస్టులపై భువనగిరి ఎంపీ చామల రియాక్షన్!

Chamala Kiran Kumar Reddy: ఆధారాలు లేకుండా వార్తలు వద్దు.. జర్నలిస్టుల అరెస్టులపై భువనగిరి ఎంపీ చామల రియాక్షన్!
Advertisement

Chamala Kiran Kumar Reddy: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కనుమ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే, రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న జర్నలిస్టుల అరెస్టులు, మీడియా కథనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ ఛానల్‌లో వచ్చిన ‘ఆఫ్ ద రికార్డు’ కథనం వల్ల తలెత్తిన పరిణామాలు, ఆ తర్వాత జరిగిన అరెస్టులు బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజకీయ నాయకులు, అధికారుల వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేసేలా ఆధారాలు లేని వార్తలు రాయడం సరికాదని ఆయన సూచించారు. “ఒకప్పుడు సంపూర్ణమైన ఆధారాలతో మీడియాలో వార్తలు వచ్చేవి, కానీ ఇప్పుడు కేవలం ఊహించి కథనాలు రాస్తున్నారు. దీనివల్ల అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత మానసిక వేదనకు గురవుతున్నారో అర్థం చేసుకోవాలి. ఒక ఉన్నత చదువులు చదువుకున్న అధికారిణి, ఒక క్యాబినెట్ మంత్రి సమాజం ముందు ఎంత బాధపడ్డారో మనం చూశాం.” అని చామల పేర్కొన్నారు.

Advertisement

ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం వల్లే ఇలాంటి అసత్య ప్రచారాలకు ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మీడియాపై తనకున్న గౌరవాన్ని చాటుతూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, నేను అయినా ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం మీడియానే. జర్నలిస్టులు, మీడియా సంస్థల పట్ల మాకు ఎప్పుడూ అభిమానం ఉంటుంది. సమాజానికి మీడియా అవసరం ఎంతో ఉంది. నాయకులు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా నిర్భయంగా వార్తలు రాయవచ్చు” అని ఆయన స్పష్టం చేశారు.

సోషల్ మీడియా ఛానళ్లను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ, వ్యక్తుల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడేలా వార్తలు వేయవద్దని చామల కోరారు. “వ్యవస్థ నడవాలంటే ఊహలతో సాధ్యం కాదు. వాస్తవాలు, ఆధారాలు లేని వార్తలు రాకుండా చూడాల్సిన బాధ్యత మీడియా యాజమాన్యాలపై ఉంది” అని ఆయన హితవు పలికారు.

Advertisement

Read Also: రోడ్డుపై కారు దగ్ధం.. చెలరేగిన మంటలు, మేడారం వెళ్లి వస్తుండగా ఘటన

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×