E-Paper
Advertisement

Tata Altroz vs Tata Tiago: టాటా ఆల్ట్రోజ్ vs టాటా టియాగో.. వీటిలో ఏది బెస్ట్ కారు?

Tata Altroz vs Tata Tiago: టాటా ఆల్ట్రోజ్ vs టాటా టియాగో.. వీటిలో ఏది బెస్ట్ కారు?
Advertisement

టాటా మోటార్స్ గత కొద్ది కాలంగా సూపర్ స్టైలిష్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని వర్గాల వినియోగదారులకు అనుగుణంగా కార్లను విడుదల చేస్తుంది. అందులో భాగంగానే ప్రీమియం హాచ్ బ్యాక్ గా టాటా ఆల్ట్రోజ్ ను తీసుకొచ్చింది. అటు ఎంట్రీ ఎవల్ హాచ్ బ్యాక్ గా టాటా టియాగోను పరిచయం చేసింది. ఈ రెండూ సురక్షితమైన కార్లు గా గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే, వేర్వేరు విభాగాలకు చెందినవి. ఆల్ట్రోజ్మంచి బూట్ స్పేస్, ప్రీమియం ఫీచర్లుతో పాటు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను కలిగి ఉంటుంది. పవర్-ఫుల్ ఇంజిన్ ను కలిగి ఉంది. టియాగో తక్కువ ధర, మెరుగైన మైలేజ్ (CNG ఆప్షన్), సిటీ డ్రైవింగ్ కు అనుగుణంగా ఉండేలా రూపొందించింది. ఆల్ట్రోజ్ ధర రూ. 6.30 లక్షల నుంచి ప్రారంభం కాగా, టియాగో 4.57 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

 టాటా ఆల్ట్రోజ్,  టాటా టియాగో పోలికలు

ఆల్ట్రోజ్ ఎక్కువ పొడవు (3990 mm)గా ఉంటుంది. ఎక్కువ బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. అదే సమయంలో 5 స్టార్ NCAP రేటింగ్ తో వస్తుంది. ఆల్ట్రోజ్ తో పోల్చితే టియాగో చిన్నదిగా (3765 mm) ఉంటుంది. సిటీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.  టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 6.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా టియాగో రూ. 4.57 లక్షల నుంచి మొదలవుతుంది. ఆల్ట్రోజ్ ప్రీమియం హాచ్ బ్యాక్ గా రాగా, టియాగో ఎంట్రీలెవర్ హాచ్ బ్యాక్ గా అడుగు పెట్టింది. ఆల్ట్రోజ్ 1.2లీ పెట్రోల్, 1.5 లీ డీజిల్, 1.2 లీ టర్బో, CNG ఇంజిన్లతో వస్తుంది. అటు టియాగో  1.2 లీ పెట్రోల్, 1.2 లీ CNG పవర్ వేరియంట్స్ తో వస్తుంది.  ఆల్ట్రోజ్ 86 bhp పవర్ ను ఉత్పత్తి చేయగా, టియాగో 85 bhp శక్తిని అందిస్తుంది.

Advertisement

Read Also: మాన్యువల్ కారును ఆటోమేటిక్‌గా మార్చుకోవచ్చు.. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా?

ఇక మైలేజ్ విషయానికి వస్తే 18 నుంచి 19 కిలో మీటర్లు ఇస్తుంది. టియాగో 19-20 కిలో మీటర్ల ప్రయాణాన్ని అందిస్తుంది. ఆల్ట్రోస్ 5 స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ ను కలిగి ఉంటుంది. టియాగో 4 స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ తో వస్తుంది. ఆల్ట్రోజ్ లో 345 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. టియాగోలో 242 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది.

ఏ కారు ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

Advertisement

ఫ్యామిలీతో ప్రయాణాలకు, విశాలమైన బూట్ స్పేస్ కావాలనుకునే వాళ్లు, ప్రీమియం ఫీచర్లను ఇష్టపడే వారికి టాటా ఆల్ట్రోజ్ అనుకూలంగా ఉంటుంది. ఇక బడ్జెట్ తక్కువగా ఉండి, సిటీలో పెట్రోల్, CNG వేరియంట్‌ తో ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి టాటా టియాగో మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు కార్లలో మీకు ఏది నచ్చింది? ఎందుకు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also: హోండా యాక్టివా 125 vs TVS జూపిటర్ 125..వీటిలో ఏది బెస్ట్ అంటే?

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×