Tata Avinya X Spotted Testing In India: ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్ లో టాటా మోటార్స్ మరో కీలక అడుగు వేస్తోంది. 2027లో విడుదల చేయాలని భావిస్తున్న టాటా అవిన్యా X ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్టింగ్ ప్రారంభమైంది. ఇటీవల ఈ మోడల్ కు సంబంధించిన క్యామోఫ్లేజ్ ప్రోటోటైప్‌లు రోడ్లపై కనిపించడంతో, ఈ కొత్త మోడల్‌పై కార్ లవర్స్ లో ఆసక్తి పెరిగింది.
టెస్టింగ్ సందర్భంగా కనిపించిన వాహనం పూర్తిగా క్యామోఫ్లేజ్ కవర్ తో కప్పి ఉంచారు. సో పూర్తి డిజైన్ స్పష్టంగా కనిపించకపోయినా, మొత్తం డిజైన్ మాత్రం ఈ SUV ఎలా ఉండబోతుందో ఒక అంచనాను ఇస్తోంది. ముందు భాగంలో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, బంపర్ చివరల దగ్గర నిలువుగా అమర్చిన లైటింగ్ యూనిట్లు కనిపిస్తున్నాయి. ఇవి 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో ప్రదర్శించిన అవిన్యా X కాన్సెప్ట్ ను గుర్తు చేస్తున్నాయి.
సైడ్ ప్రొఫైల్ ను పరిశీలిస్తే, ఈ SUVకు పొడవైన వీల్ బేస్, చిన్న ఫ్రంట్ ఓవర్ హాంగ్, వాలుగా ఉండే రూఫ్ లైన్ ఉన్నట్లు తెలుస్తోంది. కాన్సెప్ట్ మోడల్ లో ఉన్న కెమెరా ఆధారిత మిర్రర్ల స్థానంలో, ప్రొడక్షన్ వెర్షన్ లో సాధారణ వింగ్ మిర్రర్లు ఉండే అవకాశం ఉంది. పెద్ద ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్‌తో పాటు వెనుక డోర్లు కూడా పెద్దవిగా ఉండటం వల్ల క్యాబిన్ విశాలంగా ఉండే అవకాశముంది. వెనుక భాగంలో రూఫ్ స్పాయిలర్, స్టైలిష్ ర్యాప్ రౌండ్ టెయిల్ ల్యాంప్స్ లాంటి డిజైన్ అంశాలు ఉండనున్నాయని స్పై చిత్రాలు సూచిస్తున్నాయి.
టాటా అవిన్యా Xను జాగ్వార్ ల్యాండ్ రోవర్ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారు చేయనున్నారు. ఈ ప్లాట్ ఫారమ్ వినియోగానికి టాటా JLRకు రాయల్టీ చెల్లించినప్పటికీ, భారత మార్కెట్‌కు తగ్గట్టుగా భారీ స్థాయిలో లోకలైజేషన్ చేయనున్నారు. దీంతో ధరను పోటీ స్థాయిలో ఉంచే అవకాశం ఉంది.
ఇంటీరియర్‌కు సంబంధించిన అధికారిక ఫొటోలు ఇంకా బయటకు రాలేదు. అయితే, కాన్సెప్ట్ మోడల్ లో చూపించిన డిజైన్ ప్రకారం, ఇందులో అత్యాధునిక ఫీచర్లతో కూడిన క్యాబిన్ ఉండే అవకాశం ఉంది. డ్యాష్ బోర్డ్ పై మూడు డిజిటల్ స్క్రీన్లు, అదనంగా మరో పెద్ద టచ్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. ఈ సెటప్ ను ప్రొడక్షన్ వెర్షన్ లో కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అవివిన్యా Xలో టూ స్పోక్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్-2 ADAS, అలాగే V2L, V2V లాంటి అత్యాధునిక ఎలక్ట్రిక్ ఫీచర్లు అందించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ క్రేజీ ఫీచర్లు ఈ SUVని ప్రీమియం సెగ్మెంట్ లో నిలబెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం టాటా అవిన్యా X ప్రైమరీ టెస్టింగ్ లో ఉంది. 2027లో భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసే అవకాశముంది.
Read Also: థార్ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!