E-Paper
Advertisement

కడపలో కిరాతకం.. భార్య లావుగా ఉందని పాలకోవాలో విషం కలిపి చంపిన భర్త

కడపలో కిరాతకం.. భార్య లావుగా ఉందని పాలకోవాలో విషం కలిపి చంపిన భర్త
Advertisement

Kadapa Proddatur murder case: కడప జిల్లా ప్రొద్దుటూరులో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య అధిక బరువుతో లావుగా ఉందనే కారణంతో ఒక భర్త ఆమెను కడతేర్చాడు. ఏప్రిల్ 30వ తేదీన జరిగిన ఈ అనుమానాస్పద మరణం కేసులో పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. సమాజంలో భార్య వల్ల తన గౌరవం పోతోందని భావించిన నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్యకు పాల్పడ్డాడు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడిని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు. తన భార్య ఊబకాయంతో బాధపడుతోందని.. ఆమె ప్రవర్తన సమాజంలో తనను తక్కువ చేసి చూపేలా ఉందని అతను వాదించాడు. దీనికి తోడు నిందితుడికి గతంలో హైదరాబాద్‌లో ఉన్న సమయంలో మరొక మహిళతో వివాహేతర సంబంధం ఉండేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కారణాలతోనే భార్యను వదిలించుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు.

Advertisement

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. భార్యను ఎలా చంపాలనే అంశంపై నిందితుడు ముందుగా యూట్యూబ్, గూగుల్ లో వెతికాడు. ముఖ్యంగా ఎవరికీ అనుమానం రాకుండా విషం ఇచ్చి ఎలా చంపాలనే దానిపై సెర్చ్ చేసి ఒక నంబరును సంప్రదించాడు. ఆ వ్యక్తి ద్వారా ఆన్‌లైన్‌లో విషాన్ని తెప్పించుకున్నాడు. ఏప్రిల్ 29వ తేదీ రాత్రి భార్యకు పాలకోవాలో విషం కలిపి ఇచ్చాడు. అది తిన్న వెంటనే ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. విషం ప్రభావం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పటికీ.. పూర్తిగా ప్రాణాలు పోలేదని గమనించిన నిందితుడు మరింత క్రూరంగా వ్యవహరించాడు. ఆమె తల పైన దిండు పెట్టి అదిమి పట్టుకున్నాడు. సుమారు 40 నిమిషాల పాటు ఆమెపై మోకాళ్లతో నొక్కి పెట్టి ప్రాణాలు పోయే వరకు అలాగే ఉన్నాడు. హత్య జరిగిన తర్వాత ఏమీ తెలియనట్లుగా పక్కనే పడుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

బాధితురాలి వయస్సు 31 సంవత్సరాలు అని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బాడీ షేమింగ్.. వివాహేతర సంబంధం వంటి కారణాలతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించాయి.

Advertisement

Read Also: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. భార్య పరిస్థితి విషమం!

Tags

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×