E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి
Advertisement

Road Accident: పశ్చిమ గోదావరి జిల్లాలో క్రిస్మస్ వేడుకల వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామ శివారులో ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. పోలమూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్నారు. అదుపుతప్పిన బైక్ డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో ముగ్గురూ రోడ్డుపైకి ఎగిరిపడి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు పోలమూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించామని, వారి కుటుంబాలకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతులు బైక్ పై మద్యం సేవించి ఉన్నరా లేక అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణచేపడుతున్నారు.

Advertisement

Also Read: ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. స్పాట్‌లో 36 మంది

ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేయడం ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో అధిక వేగం, హెల్మెట్ వినియోగం లేకపోవడం ప్రాణాంతకంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×