E-Paper
Advertisement

CP Sajjanar: తాగి దొరికితే 6 నెలలు జైలు శిక్ష.. మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక

CP Sajjanar: తాగి దొరికితే 6 నెలలు జైలు శిక్ష.. మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక
Advertisement

CP Sajjanar: హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్‌ వద్ద నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. తనిఖీలు జరుగుతున్న తీరును, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులతో సీపీ సజ్జనార్ నేరుగా మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలకు కలిగే నష్టాలను వారికి వివరించారు. క్షణిక ఆనందం కోసం మద్యం తాగి డ్రైవింగ్ చేయడం అనేక కుటుంబాల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉందన్నారు.

Advertisement

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నామని సీపీ తెలిపారు. డిసెంబరు 31 రాత్రి వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. నగరంలోని 120 కీలక ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామని వివరించారు. డిసెంబర్ 31న రాత్రి ప్రత్యేకంగా 100కు పైగా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని సీపీ సజ్జనార్ ఖరాఖండీగా చెప్పారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడమే కాకుండా రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. తప్పిద తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

అలాగే న్యూ ఇయర్ జోష్‌లో రోడ్లపై రేసింగ్‌లు, వీలింగ్‌లు, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే కూడా కఠిన చర్యలు తప్పవని సీపీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యువత ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. పోలీసులతో సహకరిస్తేనే నూతన సంవత్సరం ప్రశాంతంగా, సురక్షితంగా కొనసాగుతుందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

ALSO READ: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి నుంచి కారు బోల్తా, నలుగురు మృతి

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×