భారతీయ దిగ్గజ ఆటో మోబైల్ కంపెనీ టాటా మోటార్స్ 7–55 టన్నుల శ్రేణిలో 17 ట్రక్కులను విడుదల చేసింది. దేశీ వాణిజ్య వాహన విభాగంలో ఇదో కీలక మైలురాయిగా కంపెనీ అభివర్ణించింది. వీటిలో ఇంటర్మీడియట్, లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ కోసం కొత్త అజురా శ్రేణిని తీసుకొచ్చింది. Tata Trucks.ev బ్రాండ్ ఎలక్ట్రిక్ ట్రక్ లైనప్ లోని ప్రస్తుత ప్రైమా, సిగ్నా, అల్ట్రా మోడల్స్ ను కొత్త అప్ డేట్స్ తో తీసుకొచ్చింది.
కొత్త ట్రక్కులు ECE R29 03 క్రాష్ సేఫ్టీ స్టాండర్డ్స్ కు అనుగుణంగా తయారు చేయబడ్డాయి. ఫ్లీట్ ఆపరేటర్లకు మరింత భద్రత కల్పించడంతో పాటు ఆపరేటింగ్ ఎఫిషియెన్సీ తో పాటు తక్కువ ధరకు అందించేలా వీటిని రూపొందించింది. మీడియం, హెవీ డ్యూటీ అప్లికేషన్లలో ఎక్ట్రికల్, కనెక్టెడ్ వెహికిల్ సాంకేతికతను తీసుకొచ్చింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో ట్రక్కులను విడుదల చేయడం పట్ల టాటా మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, CEO గిరీష్ వాఘ్ సంతోషం వ్యక్తం చేశారు. “దేశ ట్రక్కింగ్ ల్యాం డ్‌స్కేప్ వేగంగా అప్ డేట్ అవుతుంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, సురక్షితమైన, పరిశుభ్రమైన, సమర్థవంతమైన లాజిస్టిక్స్ కోసం డిమాండ్ పెరుగుతున్నది. ట్రక్కుల తయారీలో టాటా మోటార్స్ ఎప్పుడూ బెంచ్ మార్క్ ను సెట్ చేస్తుంది. అందులో భాగంగానే నెక్ట్స్ జెనరేషన్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చాం” అన్నారు.
టాటా మోటార్స్ ILMCV సెగ్మెంట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సరికొత్త అజురా రేంజ్ ను తీసుకొచ్చింది. ఇది 7 నుంచి 19 టన్నుల వరకు పలు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. ఇ-కామర్స్, FMCG పంపిణీ, వైట్ గూడ్స్ డెలివరీ, నిర్మాణ సామగ్రి, వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాంతీయ లాజిస్టిక్స్ అవసరాలను తీర్చేలా వీటిని రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. అజురా ట్రక్కులు కొత్త 3.6-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో శక్తిని పొందుతాయి.
టాటా మోటార్స్ సిగ్నా, ప్రైమా, అల్ట్రా, అజురా రేంజ్ లోని ట్రక్ క్యాబిన్‌లను ECE R29 03 క్రాష్ భద్రతా నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది. వీటిలో ఫ్రంటల్ ఇంపాక్ట్, రోల్‌ఓవర్, సైడ్ ఇంపాక్ట్ నుంచి మంచి భద్రతను కలిగి ఉన్నాయి. ఈ ట్రక్కులు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, కొలిషన్ మిటిగేషన్ సిస్టమ్స్ లాంటి మల్టీ యాక్టివ్ సేఫ్టీ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఈ అప్ గ్రేడ్ లతో, కంపెనీ తన దేశీయ ట్రక్ లకు అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలను అందిస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లలో పేలోడ్ సామర్థ్యం 1.8 టన్నుల వరకు పెరిగిందని టాటా మోటార్స్ వెల్లడించింది. నిర్దిష్ట ప్లాట్‌ఫామ్‌లపై 6.7-లీటర్ కమ్మిన్స్ డీజిల్ ఇంజిన్ వాడకంతో సహా డ్రైవ్ ట్రెయిన్ అప్ గ్రేడ్స్ పొంతుంది.
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ మొబిలిటీ పోర్ట్ ఫోలియోను బలోపేతం చేస్తూ, టాటా Trucks.ev బ్రాండ్ కింద కొత్త ఎలక్ట్రిక్ ట్రక్కులను ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ లైనప్ 7 నుంచి 55 టన్నుల వరకు విస్తరించి ఉంది. పట్టణ లాజిస్టిక్స్, నిర్మాణం, పోర్టులు, క్లోజ్డ్ లూప్ ఆపరేషన్‌లతో సహా పలు అవసరాలకు అనుగుణంగా రూపొందించింది.
Read Also: కొత్త థార్ రాక్స్ స్పెషల్ ఎడిషన్ వచ్చేస్తోంది, టీజర్ చూస్తేనే కొనాలనిపిస్తుందిగా!