Tata Motors March 2026 Offers: దేశీయ దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్ అమ్మకాలను భారీగా పెంచుకోవడమే లక్ష్యంగా కీలక ఆఫర్లు ప్రకటించింది. మార్చి 2026కు సంబంధించి భారీగా తగ్గింపు అందిస్తున్నట్లు ప్రకటించింది. టాటా హారియర్ EV, టిగోర్ EV మినహా, మిగతా ఎలక్ట్రిక్ లైనప్ అంతటా క్రేజీ ఆఫర్లను అందిస్తోంది. మార్చి 2026కు సంబంధించిన ఆఫర్లు MY2024 స్టాక్‌పై మాత్రమే వర్తిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్లలో భాగంగా ఆయా మోడళ్లలో రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంటుంది. అప్‌గ్రేడ్ చేసుకునే యజమానులు, టాటా గ్రూప్ ఉద్యోగులు ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే, హారియర్ EV, టిగోర్ EV ఈ నెలకు ఎటువంటి తగ్గింపులను పొందవని టాటా మోటార్స్ తెలిపింది.
గత నెలలో మాదిరిగానే కర్వ్ EV ఈ నెల కూడా భారీ తగ్గింపును అందుకుంటుంది. కూపే eSUV పై కస్టమర్లు రూ.1.71 లక్షల వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది. కర్వ్ EV 45kWh, 55kWh బ్యాటరీ ప్యాక్ తో అందుబాటులో ఉంది. ఈ కారు రూ. 17.49 లక్షల నుంచి రూ. 22.24 లక్షల్లో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి e విటారా, విన్ ఫాస్ట్ VF6, మహీంద్రా BE 6, MG విండ్సర్ లాంటి కార్లతో ఇది పోటీ పడుతుంది.
టాటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ నెక్సాన్ EVకి సంబంధించి టాటా రూ. 1.41 లక్షల వరకు ఆఫర్లను అందిస్తోంది. ఈ కారు ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.49 లక్షల వరకు అందుబాటులో ఉంది. కాంపాక్ట్ eSUV మీడియం రేంజ్ (30kWh), లాంగ్ రేంజ్ (45kWh) వేరియంట్స్ తో అందుబాటులో ఉంది. నెక్సాన్ EV మహీంద్రా XUV 3XO EVకి పోటీగా కొనసాగుతోంది.
టాటా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు టియాగో EVపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్లు అందిస్తుంది. ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో అందుబాటులోకి వస్తుంది. 19.2kWh, 24kWh బ్యాటరీ ప్యాక్ లతో అందుబాటులో ఉంది. టియాగో EV ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.14 లక్షల వరకు ఉంటుంది ఉంటుంది. MG కామెట్ EVకి పోటీగా ఉంటుంది.
పంచ్ EVని ఫేస్‌లిఫ్ట్ అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుత మోడల్‌పై ఆఫర్‌లు లేవు. అయితే, సబ్ కాంపాక్ట్ eSUV ప్రీ ఫేస్‌లిఫ్ట్ MY24 యూనిట్లపై రూ. 1.20 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఫేస్ లిఫ్ట్ కు ముందు పంచ్ EV ధర రూ. 10.99 లక్షల నుంచి రూ. 14.49 లక్షల వరకు ఉంది. 25kWh, 35kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందించబడింది. ఇది సిట్రోయెన్ eC3కి ప్రత్యర్థిగా ఉంది.
Read Also: ఎలక్ట్రిక్ కారులో హమ్మింగ్ సౌండ్.. డోంట్ వర్రీ.. ఇదీ అసలు మ్యాటర్!