GHMC: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లో అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీలో ఔట సోర్స్ ఉద్యోగుల హవా కొనసాగుతుంది. విచిత్రమేమిటంటే జీహెచ్ఎంసీలోని అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ లో భార్య భర్తలైన ఓ ఔట్ సోర్స్ ఉద్యోగి, మరో ఇంజనీర్ దే హవా కొనసాగుతున్నట్లు సమాచారం. ఎంత సమర్థవంతులైన ఆఫీసర్లు జీహెచ్ఎంసీకి కమిషనర్లుగా వచ్చిన తమ పని తాము చేసుకుని పోతామన్న ధీమాతో ఉన్న అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ లోని కొందరు ఔట్ సోర్స్ ఉద్యోగులు పర్మినెంట్ ఉద్యోగులపై డామినేట్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడు, నాలుగో తరగతికి చెందిన పర్మినెంట్ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని పలు రకాల వేధింపులకు కూడా పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రజలకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ ఆదాయ వనరుల్లో ఒకటైన అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ లో ఓ ఔట్ సోర్స్ ఉద్యోగిదే హవా కొనసాగుతున్నట్లు సమాచారం.
సదరు ఉద్యోగ సుమారు ఏడేళ్ల నుంచి స్థానచలనం లేకుండా ప్రధాన కార్యాలయంలోని అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ లో కీలకమైన విధులు నిర్వహిస్తూ, అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ లో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్ల క్రితం సదరు ఔట్ సోర్స్ ఉద్యోగి ఐటీ విభాగంలో సక్రమంగా విధులు నిర్వహించకపోవటంతో అప్పటి ఐటీ అదనపు కమిషనర్ సదరు ఉద్యోగిని ఐటీ నుంచి అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ కు బదిలీ చేసినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లుగా పునర్ వ్యవస్థీకరించిన గత నెల 11వ తేదీ తర్వాత చేపట్టిన ఔట్ సోర్స్ ఉద్యోగుల బదిలీల్లో భాగంగా సదరు ఔట్ సోర్స్ ఉద్యోగులను ట్రాన్స్ ఫర్ చేస్తూ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలు కూడా సదరు ఉద్యోగి విషయంలో అమలు కాలేదని తెల్సింది. కమిషనర్ ఔట్ సోర్స్ ఉద్యోగుల బదిలీ సమయంలో సదరు ఔట్ సోర్స్ ఉద్యోగి తాను కూడా బదిలీ అవుతానని భావించి, జీహెచ్ఎంసీ అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ కు చెందిన మొత్తం సమాచారాన్ని ప్రెన్ డ్రైవ్ లలో సేవ్ చేసి తీసుకెళ్లిన ఆరోపణలు కూడా ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ కు చెందిన ఓ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రస్తుతం అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ లో విధులు నిర్వహిస్తూ, సదరు ఔట్ సోర్స్ ఉద్యోగికి అండదండగా నిలుస్తూ, అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ లో పలు అక్రమాలు జరిగేందుకు సహకరిస్తున్నట్లు కూడా తెలిసింది.
Also Read: Visakhapatnam: రూటు మార్చిన అంబటి రాంబాబు.. జిల్లాల పర్యటనలు అందుకోసమేనా?
అడ్వర్ టైజ్ మెంట్ విభాగంలోని సదరు ఔట్ సోర్స్ ఉద్యోగి కమిషనర్ ఇటీవలే చేపట్టిన ట్రాన్స్ ఫర్స్ ప్రకారం ఐటీ వింగ్ లో ఔట్ సోర్స్ కంప్యూటర్ ఆపరేటర్ గా సదరు ఉద్యోగి విధులు నిర్వర్తించాల్సి ఉంది. కానీ ఈ ఉద్యోగి కమిషనర్ ఆదేశాలకు విరుద్దంగా ఐటీ సెక్షన్ లో అటెండెన్స్ వేసుకుని ఐటీ, సెంట్రల్ ట్యాక్స్ సెక్షల్ లలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కమిషనర్ ఇటీవలే చేపట్టిన ట్రాన్స్ ఫర్స్ లోనూ చక్రం తిప్పిన సదరు ఔట్ సోర్స్ ఉద్యోగి తన ట్రాన్స్ ఫర్ ను తనకు అనుకూలంగా మలుచుకుని, ఐటీ, సెంట్రల్ ట్యాక్స్, అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే కమిషనరే బదిలీ కావాలని కానీ తనకెలాంటి ఢోకా లేదన్న ధీమాతో సదరు ఉద్యోగి ఇష్టారాజ్యంగా విధి నిర్వహణ, అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ లో పలు అక్రమాలతో పాటు ట్యాక్స్ సెక్షన్ లోనూ పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేవు. ఉన్నతాధికారులు కూడా పర్మినెంట్ ఉద్యోగులకు తరుచూ బదిలీలు చేస్తున్నా, కమిషనర్, అదనపు కమిషనర్లు రోజూ విధులు నిర్వర్తించే ప్రధాన కార్యాలయంలో ఏకంగా ఏడేళ్ల నుంచి ఓ ఔట్ సోర్స్ ఉద్యోగి పలు అక్రమాలకు పాల్పడుతూ, మూడు వింగ్ లలో విధులు నిర్వహించటం పట్ల ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఉన్నతాధికారులు స్పందించని పక్షంలో సదరు ఉద్యోగి చేతిలో వేధింపులకు గురైన పర్మినెంట్ ఉద్యోగులు, ఔట్ సోర్స్ ఉద్యోగులు స్పెషలాఫీసర్ కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఉద్యోగుల ట్రాన్స్ ఫర్స్ కు సంబంధించి ఆదేశాలు జారీ చేయటమే తప్పా, క్షేత్ర స్థాయిలో ఆ ఆదేశాలు అమలవుతున్నాయా? లేదా? ఆ ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగుల బదిలీలు జరిగాయా? అన్న అంశంపై పర్యవేక్షించకపోవటం వల్లే బదిలీలైన ఔట్ సోర్స్ ఉద్యోగులు తమ వింగ్ లో గాక, అదనంగా ఏకంగా మూడు వింగ్ లలో విధులు నిర్వహిస్తూ తన తోటి ఔట్ సోర్స్ ఉద్యోగులతో పాటు పర్మినెంట్ ఉద్యోగులను కూడా రకరకాలుగా ఇబ్బందుల పాల్చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తమ ఆదేశాలను పాటించని వారిపై శాఖాపరమైన ఆదేశాలు తప్పవని కమిషనర్ స్థాయి అధికారులు తరుచూ వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో కమిషనర్ కర్ణన్ ఆదేశాలకు విరుద్దంగా ఏకంగా మూడు వింగ్ లలో విధులు నిర్వహించట పట్ల కమిషనర్ ఏ రకంగా స్పందిస్తారో? వేచి చూడాలి.
Also Read: BRS : రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరివైపు?