E-Paper
Advertisement

టాటా కార్ల ధరల పెంపు, ఏ మోడల్ కు ఎంత పెరిగిందంటే?

టాటా కార్ల ధరల పెంపు, ఏ మోడల్ కు ఎంత పెరిగిందంటే?
Advertisement

Tata Safari and Harrier Prices Hiked: టాటా మోటార్స్ ధర పెంపునకు సంబంధించి మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్రాండ్ పాపులర్ ఎస్‌యూవీ అయిన సఫారీ ధరలను పెంచింది. ముఖ్యంగా డీజిల్ వేరియంట్లపై ఈ పెంపు ప్రభావం భారీగా పడనుంది. వేరియంట్‌ ను బట్టి ధరలు సుమారు రూ. 8,700 నుంచి రూ. 22,000 వరకు పెరిగాయి. అయితే, పెట్రోల్ వేరియంట్లపై మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పాత ధరలకే కొనసాగుతున్నాయి.

చాలా వేరియంట్లపై ధరల పెంపు ప్రభావం

ఈ ధరల పెంపు సఫారీ మోడల్‌ లోని చాలా వేరియంట్లపై పడింది. స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, అకంప్లిష్డ్ లాంటి ప్రధాన ట్రిమ్‌ లతో పాటు, వాటి ప్లస్, డార్క్, స్టెల్త్ ఎడిషన్లపై కూడా ఈ పెంపు అమలైంది. అంతేకాకుండా, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్లు రెండింటిపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. ధరల పెంపును పరిశీలిస్తే, బేసిక్, తక్కువ వేరియంట్లలో పెరుగుదల తక్కువగానే ఉంది. కానీ, మిడ్, టాప్ వేరియంట్లలో భారీగా ధరలు పెరిగాయి. ముఖ్యంగా కొన్ని కాన్ఫిగరేషన్లలో రూ.15,000 నుంచి రూ.22,000 వరకు పెరుగుదల కనిపిస్తోంది. టాప్ మోడల్స్ కొనాలనుకునే వినియోగదారులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ఇంజిన్ పనితీరు గురించి..

Advertisement

ఇంజిన్, పనితీరు విషయానికి వస్తే, సఫారీలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది ఇప్పటికీ అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ తోనే వస్తోంది. ఈ ఇంజన్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్లతో అందుబాటులో ఉంటుంది. అలాగే 6-సీటర్, 7-సీటర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ ధరల సవరణలో భాగంగా ఫీచర్లు, స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

సఫారీ కారు ప్రారంభ ధర ఎంత అంటే?

కొత్త ధరల ప్రకారం.. టాటా సఫారీ డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర ఇప్పుడు ఎక్స్ షోరూమ్‌ లో సుమారు రూ.14.75 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది వేరియంట్‌ ను బట్టి మరింత పెరుగుతుంది. టాటా సఫారీతో పాటు టాటా మోటార్స్ మరో ఎస్‌యూవీ అయిన హారియర్ డీజిల్ వేరియంట్ల ధరలను కూడా ఇదే తరహాలో పెంచింది. ఈ పెంపులు ఈ నెల నుంచే అమల్లోకి వచ్చాయి.

Advertisement

Read Also: సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, అదిరిపోయే రేంజ్, హోండా క్రేజీ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది!

టాటా మోటార్స్ ధరల పెంపు కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత భారంగా అనిపించినా, సఫారీ ఇప్పటికీ మంచి ఫీచర్లు, బలమైన పనితీరు, విశాలమైన ఇంటీరియర్‌ తో మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ధరలు పెరిగినప్పటికీ, ఇది ఫ్యామిలీ ఎస్‌యూవీగా మంచి ఆదరణ దక్కించుకుంది.

Read Also: ఇల్లుగా మారిన హ్యుండాయ్ కారు, సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×