E-Paper
Advertisement

AP News: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా? మద్యం మత్తులో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి

AP News: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా? మద్యం మత్తులో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి
Advertisement

AP News: వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం కొండుగారిపల్లె గ్రామంలో సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. నమ్మకానికి మారుపేరుగా ఉండాల్సిన ఒక ఉపాధ్యాయుడు, మద్యం మత్తులో తన దగ్గర చదువుకునే నాలుగో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న సుబ్బారెడ్డి అనే ఉపాధ్యాయుడు, కళ్ళు మూసుకుపోయిన స్థితిలో చిన్నారిపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ విషయాన్ని గమనించిన బాధితురాలి తల్లిదండ్రులు, గ్రామస్థులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. విద్య నేర్పాల్సిన గురువే భక్షకుడిగా మారడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే సదరు ఉపాధ్యాయుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడిని గ్రామస్థులంతా కలిసి పోలీసులకు అప్పగించే ముందు తమ నిరసనను వ్యక్తం చేస్తూ విద్యా వ్యవస్థకే మాయని మచ్చ తెచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

సమాచారం అందుకున్న పోరుమామిళ్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారికి మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు కూడా స్పందిస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేలా నివేదిక సిద్ధం చేస్తున్నారు.

Also Read: ఒక్క ప్లేటు మోమోస్ కోసం రూ.85 లక్షలు.. ఈ పిల్లాడిని ఎలా ట్రాప్ చేశారంటే?

Advertisement

పిల్లలను నమ్మి బడికి పంపే తల్లిదండ్రులకు ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. విద్యాసంస్థల్లో ఇటువంటి మృగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని మహిళా సంఘాలు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×