Tata September 2026 Offers: కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ సెప్టెంబర్ నెలలో పలు మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ కంబషన్ ఇంజిన్‌తో నడిచే కార్లలో ఎక్కువ భాగం ఈ నెలలో డిస్కౌంట్లు, స్క్రాపేజ్, లాయల్టీ, ఇంటర్వెన్షన్ లాంటి బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే పంచ్, కొత్త 2026 టియాగో మినహా మిగిలిన ఎంపిక చేసిన మోడళ్లపై ఆఫర్లు ఉన్నాయి. వీటిలో కర్వ్ కు అత్యధికంగా రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తుండగా, నెక్సాన్‌పై గరిష్టంగా రూ.75,000 వరకు బెనిఫిట్స్ అందిస్తున్నారు.
టాటా కర్వ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ నెలలో గరిష్టంగా రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. ఇందులో రూ.30,000 డిస్కౌంట్, రూ.45,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.50,000 లాయల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇటీవల కర్వ్ వేరియంట్ లైనప్ లో కూడా టాటా మార్పులు చేసింది. ముఖ్యంగా ఎంట్రీ, మిడ్ స్పెక్ వేరియంట్లలో అదనపు ఫీచర్లను చేర్చింది.
టాటా నెక్సాన్‌పై వేరియంట్‌ను బట్టి రూ.55,000 నుంచి రూ.75,000 వరకు బెనిఫిట్స్ అందుతున్నాయి. కొన్ని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై రూ.10,000 డిస్కౌంట్, రూ.45,000 ఇంటర్వెన్షన్ బెనిఫిట్, రూ.20,000 తగ్గింపు కలిపి రూ.75,000 వరకు లభిస్తుంది. ఇతర పెట్రోల్ వేరియంట్లకు రూ.55,000 వరకు, CNG మోడల్‌కు రూ.60,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. డీజిల్ వెర్షన్‌పై మాత్రం రూ.20,000 వరకు స్క్రాపేజ్ ప్రయోజనం లభిస్తోంది.
ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్‌పై కూడా టాటా డిస్కౌంట్ అందిస్తోంది. CNG వేరియంట్‌పై గరిష్టంగా రూ.55,000 వరకు ప్రయోజనం ఉంది. పెట్రోల్, డీజిల్ మోడళ్లలో కొన్ని వేరియంట్లకు రూ.35,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి.
టాటా హారియర్, సఫారీ డీజిల్ వేరియంట్లపై సెప్టెంబర్‌లో రూ.45,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.10,000 డిస్కౌంట్‌తో పాటు రూ.35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉంది. అయితే, టర్బో-పెట్రోల్ వేరియంట్లకు ఈ డిస్కౌంట్ వర్తించదు.
2026కి ముందు తయారైన టియాగో స్టాక్‌పై రూ.35,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంపిక చేసిన పెట్రోల్, CNG వేరియంట్లకు డిస్కౌంట్, ఇంటర్వెన్షన్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ కలిపి ఈ మొత్తం లభిస్తుంది.
టాటా టిగోర్‌పై రూ.30,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో రూ.15,000 డిస్కౌంట్, మరో రూ.15,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. మరోవైపు టాటా సియెర్రా పెట్రోల్, డీజిల్ వెర్షన్లపై కూడా రూ.30,000 వరకు బెనిఫిట్ అందిస్తున్నారు. ఇది డిస్కౌంట్, స్క్రాపేజ్ లేదా లాయల్టీ రూపంలో లభిస్తుంది.
ఈ ఆఫర్లు సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తాయి. సిటీ, డీలర్ షిప్, వెహికల్ తయారీ సంవత్సరం, స్టాక్ పరిస్థితిని బట్టి ఆఫర్ మారవచ్చు. అందుకే, కారు బుక్ చేసే ముందు స్థానిక టాటా డీలర్ దగ్గర ధర, డిస్కౌంట్ వివరాలను చెక్ చేయడం మంచిది.
Read Also: టాటా కర్వ్ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!