E-Paper
Advertisement

Virosh Wedding: అతిధుల కోసం ప్రత్యేక విందు.. మెనూ కార్డ్ షేర్ చేసిన రష్మిక!

Virosh Wedding: అతిధుల కోసం ప్రత్యేక విందు.. మెనూ కార్డ్ షేర్ చేసిన రష్మిక!
Advertisement

Virosh Wedding:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇన్ని రోజులు రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న (Rashmika mandanna) విజయ్ దేవరకొండ (Vijay deverakonda) ఎట్టకేలకు వివాహం చేసుకోబోతున్నారు. ఇన్ని రోజులు రహస్యంగా తమ బంధాన్ని కొనసాగించిన ఈ జంట.. ఇప్పుడు ఏడడుగులు వేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పైగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ కూడా తమ అధికారిక ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తమ పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్”గా అంటూ అధికారికం చేశారు. ఇకపోతే విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న ఎప్పుడెప్పుడు తమ వివాహం గురించి అధికారికంగా ప్రకటిస్తారా? అని ఎదురుచూసిన అభిమానులకు, సెలబ్రిటీలకు ఇది అతిపెద్ద శుభవార్త అని చెప్పవచ్చు.

పెళ్లికి సిద్ధమైన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న:

ఇకపోతే విజయ్ దేవరకొండ ,రష్మిక మందన్న ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ లోని ప్యాలెస్ లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఏడడుగులు వేయబోతున్నారు. ఇప్పటికే జైపూర్ చేరుకున్న కుటుంబ సభ్యులు అక్కడి ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది . పైగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల ఎయిర్పోర్ట్లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇక నిన్నటికి నిన్న రష్మిక మందన్న అక్కడే సెలూన్ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అతిధుల కోసం ప్రత్యేకమైన భోజనం..

Advertisement

ఇదిలా ఉండగా రష్మిక మందన్న తమ పెళ్లి వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను తన కాబోయే భర్త విజయ్ దేవరకొండ తో కలిసి చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ వివాహానికి హాజరయ్యే అతిధులకు ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేయాలని ఈ జంట భావించినట్లు ఉంది. అందులో భాగంగానే రష్మిక తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా అతిధులకు వడ్డించే విందుకు సంబంధించిన మెనూ కార్డును షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే రష్మిక షేర్ చేసిన ఈ పోస్టును బట్టి చూస్తే జపనీస్ వంటకాలకు ఇక్కడ ప్రముఖ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ తమ వెడ్డింగ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు అనడంలో సందేహం లేదు.

ALSO READ:Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ కి చేదు అనుభవం.. క్లారిటీ ఇచ్చిన జగ్గీ!

రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ చిత్రాలు..

Advertisement

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ 2018లో వచ్చిన ‘గీతాగోవిందం’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి జంటగా పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత 2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా నటించారు. ఇక మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా స్వదేశీ ప్రతిఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సెప్టెంబర్ 11 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి రచన , దర్శకత్వం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×