E-Paper
Advertisement

Tata Sierra Records: బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న టాటా సియెర్రా, 24 గంటల్లో ఏకంగా 70 వేల బుకింగ్స్!

Tata Sierra Records: బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న టాటా సియెర్రా, 24 గంటల్లో ఏకంగా 70 వేల బుకింగ్స్!
Advertisement

Tata Sierra 2025 Bookings: టాటా కంపెనీ నుంచి రీసెంట్ గా లాంచ్ అయిన టాటా సియెర్రా SUV బుకింగ్స్ డిసెంబర్ 16న ప్రారంభం అయ్యాయి. ఈ కార్ల బుకింగ్స్ కు వినియోగదారుల నుంచి ఊహించని స్పందన లభించింది. కేవలం 24 గంటల్లో 70,000 బుకింగ్స్ సాధించింది. మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్లు అయ్యింది. మరో 1.35 లక్షల మంది కస్టమర్లు వేరియంట్ సెలెక్ట్ చేసి బుకింగ్ ప్రాసెస్ పూర్తి చేసే దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారుకు సంబంధించి డెలివరీలో 2026 జనవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. కారు ధర రూ. 11.49 లక్షల నుంచి రూ. 21.29 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. డీజిల్ వేరియంట్లకు ఎక్కువ డిమాండ్ లభిస్తోంది. బుకింగ్స్ లో 50% కంటే ఎక్కువ బుకింగ్స్ డీజిల్ వేరియంట్ నుంచే ఉన్నాయి. ఇక ఈ కారు లీటర్ కు ఏకంగా 29.9 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తున్నట్లు టాటా కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

క్రేజీ రెస్పాన్స్‌ కు మెయిన్ కారణాలు

సరికొత్త టాటా సియెర్రా అడ్వాన్స్ డ్ బుకింగ్స్ దూకుడు కనబరిచేందుకు పలు కారణాలు ఉన్నాయి. ఐకానిక్ రెట్రో డిజైన్, మోడర్న్ ఫీచర్లు ముఖ్యంగా ట్రిపుల్ స్క్రీన్ సెటప్, లెవల్-2 ADAS, పనోరమిక్ సన్‌ రూఫ్, మల్టిపుల్ ఇంజన్ ఆప్షన్స్, పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ తో పాటు టాటా బ్రాండ్ ట్రస్ట్ కారణంగా వీటికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. టాటా కంపెనీ అధికారులు సియెర్రా అడ్వాన్స్ డ్ బుకింగ్స్ కు వస్తున్న జోరును ‘ఓవర్‌ వెల్మింగ్’గా పిలుస్తున్నారు. ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ లాంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

టాటా సియెర్రా ఫీచర్లు

Advertisement

ఈ కారు బాక్సీ, మస్క్యులర్ సిల్హౌట్ ను కలిగి ఉంటుంది. పాత సియెర్రా నుంచి ఇన్‌స్పైర్ అయి రూపొందించారు. కనెక్టెడ్ LED లైట్ బార్ ఫ్రంట్, రియర్ లో ఉంటుంది. స్లిమ్ బై-LED హెడ్‌ ల్యాంప్స్ ఉంటాయి. 19-ఇంచుల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్,  ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, బాడీ క్లాడింగ్, రూఫ్ రెయిల్స్ ను కలిగి ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే ట్రిపుల్ 12.3 ఇంచ్ స్క్రీన్ సెటప్, 12 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మాస్, సోనిక్ షాఫ్ట్ సౌండ్‌బార్ తో వస్తుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి. వైర్‌ లెస్ చార్జర్, రియర్ సన్‌ షేడ్స్ ఉంటాయి. ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో 4-స్పోక్ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంటుంది.

టాటా సియెర్రా ఇతర ప్రత్యేకతలు

ఇండియాలో ఫస్ట్ ICE వెహికల్ విత్ 5G కనెక్టివిటీ, ఈథర్నెట్-బేస్డ్ t.idal 2.0 ఆర్కిటెక్చర్ తో వస్తుంది. కనెక్టెడ్ కార్ టెక్ iRA, అలెక్సా ఇంటిగ్రేషన్ ను కలిగి ఉంటుంది. 6 కలర్ ఆప్షన్స్ తో వస్తుంది.  EV వేరియంట్ 2026లో రానుంది. ఒక్కచార్జ్ తో ఏకంగా 550+ km రేంజ్ రానుంది. ఈ SUV రెట్రో చార్మ్‌ తో పాటు మోడర్న్ ప్రీమియం ఎక్స్‌ పీరియన్స్ ఇస్తుంది.

Advertisement

Read Also: మైలేజ్ టెస్ట్ లో అదరగొట్టిన టాటా సియెర్రా.. బాబోయ్ లీటర్ కు అన్ని కిలోమీటర్లా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×