Syed Mushtaq Ali Trophy 2025: సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Syed Mushtaq Ali Trophy Elite 2025 ) విజేతగా అందరూ ఊహించినట్లుగానే ఝార్ఖండ్ ( Jharkhand ) నిలిచింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ లో ఏకంగా 69 పరుగుల తేడాతో విజయం సాధించిన జార్ఖండ్ టైటిల్ గెల్చుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ హర్యానా వర్సెస్ ఝార్ఖండ్ ( Haryana vs Jharkhand, Final) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) అద్భుతమైన సెంచరీతో రెచ్చిపోయాడు. 49 బంతుల్లోనే 101 పరుగులు సాధించిన కెప్టెన్ ఈశాన్ కిషన్, జట్టును ముందుండి నడిపించాడు. ఇక జార్ఖండ్ విధించిన 263 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దారుణంగా విఫలమైన హర్యానా, 20 ఓవర్లు ఆడకముందే ఓటమి చవి చూసింది. ఛేదనలో 18.3 ఓవర్లు ఆడిన హర్యానా టీం, 193 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. ఈ దెబ్బకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ 2025 టోర్నమెంట్ ఝార్ఖండ్ వశం అయింది. ఇక ఈ ట్రోఫీని ఈశాన్ కిషన్ అందుకొని సంబరాలు చేసుకుంటోంది జార్ఖండ్ టీం.
Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంటులో భాగంగా ఇవాళ హర్యానా వర్సెస్ ఝార్ఖండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన జార్ఖండ్ 262 పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో కేవలం మూడు అంటే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది జార్ఖండ్. ఈ ఇన్నింగ్స్ లో ఈశాన్ కిషన్ 49 బంతుల్లో సెంచరీ నమోదు చేయగా, కుశగ్రా 81 పరుగులతో రెచ్చిపోయాడు. అలాగే అకుల్ రాయ్ 20 బంతుల్లో 40 పరుగులు చేయగా రాబిన్ మింజ్ 31 పరుగులతో రఫ్పాడించాడు. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో హర్యానా అట్టర్ ఫ్లాఫ్ అయింది. ఛేదనలో 18.3 ఓవర్లు ఆడిన హర్యానా టీం, 193 పరుగులు సాధించి ఆలౌట్ అయింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా గెలిచిన జార్ఖండ్ జట్టుకు భారీ ప్రైజ్ మనీ రానుంది. ముందుగా బీసీసీఐ ప్రకటించిన దాని ప్రకారం ఝార్ఖండ్ జట్టుకు 80 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఇంకా ఫైనల్స్ లో ఓడిపోయిన హర్యానా జట్టుకు 40 లక్షల రూపాయలు దక్కనుంది. గత సీజన్ లో బీసీసీఐ ఇచ్చిన రూ.80 లక్షలతో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా రూ.80 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. దీంతో గతంలో విజేతగా నిలిచిన ముంబై జట్టుకు ప్రైజ్ మనీ మొత్తం 1.6 కోట్ల రూపాయలు వచ్చాయి.