Best Mileage Cars in India 2026: భారత్ లో పెట్రోల్ ధరలు పెరగడంతో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లకు డిమాండ్ చాలా పెరిగింది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసే వారు, ఫ్యూయల్ సేవింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో మంచి మైలేజ్ తో పాటు తక్కువ ధరలో లభించే టాప్ 5 కార్ల గురించి ఇప్పుడు చూద్దాం.
మైలేజ్ విషయంలో ఈ కారు టాప్ లో ఉంటుంది. ఇది లీటర్ పెట్రోల్ కు సుమారు 26 నుంచి 27 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ధర సుమారు రూ. 5.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటుంది. తక్కువ బరువు, చిన్న ఇంజిన్ వల్ల ఫ్యూయల్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. సిటీలో రోజూ ఉపయోగించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఇది ఫ్యామిలీ కారుగా చాలా పాపులర్. సుమారు 24 నుంచి 25 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ధర రూ. 5.5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు ఉంటుంది. లోపల స్పేస్ ఎక్కువగా ఉండటం, మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం దీని ప్రత్యేకత.
ఈ కారు స్టైల్‌తో పాటు మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. సుమారు 24 నుంచి 25 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ. 6.7 లక్షల నుంచి రూ. 9.5 లక్షల వరకు ఉంటుంది. యువతకు ఈ కారు చాలా ఇష్టమైనది. డ్రైవింగ్ కూడా స్మూత్ గా ఉంటుంది.
బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ తో వచ్చే ఈ కారు ఇది. సుమారు 25 నుంచి 26 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ధర రూ. 4.5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఉంటుంది. తక్కువ ధరలో స్టైలిష్ లుక్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
సేఫ్టీతో పాటు మంచి మైలేజ్ ఇచ్చే కార్లలో ఇది ఒకటి. సుమారు 23 నుంచి 24 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ధర రూ.5.5 లక్షల నుంచి రూ.7.2 లక్షల వరకు ఉంటుంది. బలమైన బాడీ, మంచి ఫీచర్స్ దీని ఈ కారు ప్లస్ పాయింట్స్.
ఈ టాప్ 5 కార్లు అన్నీ కూడా మంచి మైలేజ్, తక్కువ ధర, ఈజీ మెయింటెనెన్స్ కలిగి ఉంటాయి. సాధారణంగా ARAI మైలేజ్ కంటే రియల్ లైఫ్ లో 15 నుంచి 20% తక్కువ ఉంటుంది. ట్రాఫిక్, డ్రైవింగ్ స్టైల్ మీద ఆధారపడుతుంది. ఎక్కువగా సిటీలో డ్రైవ్ చేస్తే సెలెరియో లేదంటే వాగన్ ఆర్ మంచి ఆప్షన్. స్టైల్, పనితీరు కావాలంటే స్విఫ్ట్ తీసుకోవచ్చు. బడ్జెట్ తక్కువ అయితే క్విడ్, సేఫ్టీ ప్రాధాన్యత ఇస్తే టియాగో బెస్ట్.
Read Also: ఆహా ఏం అమ్మకాలు భయ్యా.. ఈవీ సేల్స్ లో పంచ్, విండ్సర్ రికార్డ్!