Marriage Effects on Health: మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వారు మీ అనారోగ్య సమస్యలతో పాటు “మీరు పెళ్లి చేసుకున్నారా? ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఆహారానికి ఇబ్బంది ఏమైనా ఉందా?” వంటి వ్యక్తిగత ప్రశ్నలు అడిగారా? ఇవి మీకు వింతగా అనిపించవచ్చు. కానీ వీటినే వైద్య పరిభాషలో ‘ఆరోగ్యాన్ని నిర్ణయించే సామాజిక కారకాలు’ అంటారు. మందులు లేదా స్కాన్‌లు ఎంత ముఖ్యమో.. ఒక వ్యక్తి జీవించే పరిస్థితులు కూడా అంతే ముఖ్యం.
ఇదిలా ఉంటే.. 2018లో చేసిన ఒక సమీక్ష ప్రకారం క్లినిక్‌లలో అడిగే ఇలాంటి ప్రశ్నలు కేవలం సమాచారం కోసం మాత్రమే కాదు.. అవి మీ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు.. ఒక రోగికి మధుమేహం ఉంటే.. ఇంట్లో సరైన ఆహారం లేకపోతే, కేవలం ఇన్సులిన్ రాసివ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే ట్రీట్ మెంట్ ఇవ్వడం వల్ల కూడా కొన్ని సార్లు అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
సామాజిక అంశాలు – కొన్ని నిజాలు:
పరిశోధనల ప్రకారం.. మన సామాజిక స్థితిగతులు ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయి.
వివాహ బంధం: భాగస్వామి ఉన్నవారిలో క్యాన్సర్ వంటి వ్యాధులు ముందుగానే గుర్తించబడతాయని, ఒంటరిగా ఉండే వారిలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుందని హార్వర్డ్ పరిశోధనలు చెబుతున్నాయి.
ఇంటి పరిస్థితులు: ఇంట్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు రక్తపోటును పెంచుతాయి. 2018లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. పేదరికం గురించి ఆరా తీసి సహాయం చేయడం వల్ల అత్యవసర చికిత్సల అవసరం 20% తగ్గింది.
సైన్స్ ఏం చెబుతోంది ?
2025లో ప్రచురించిన JAMA నెట్‌వర్క్ ఓపెన్ విశ్లేషణ ప్రకారం.. సామాజిక అవసరాలను పరీక్షించే ఆసుపత్రులలో రోగులు మళ్లీ మళ్లీ అడ్మిట్ అయ్యే అవకాశం 15% తగ్గింది. అలాగే.. రోగులకు డాక్టర్ లపై నమ్మకం పెరగడానికి ఈ రకమైన మాటలు కూడా తోడ్పడతాయి. 70% మంది రోగులు తమ జీవితానికి సంబంధించి సమస్యలు డాక్టర్ లకు వివరించినప్పుడు మెరుగైన చికిత్స పొందుతున్నట్లు తేలింది.
Also Read: కంటి చూపుపై డయాబెటిస్ పంజా.. ఈ 5 ప్రభావాల పట్ల జాగ్రత్తగా ఉండండి !
ఒక డయాబెటిక్ రోగి తాను డాక్టర్ చెప్పిన ఆహార నియమాలను పాటించలేని చెబితే.. డాక్టర్ మందులతో పాటు ప్రభుత్వ ఆహార పథకాలను (SNAP వంటివి) సూచించగలరు. అలాగే.. ఇంట్లో గృహ హింసకు గురవుతున్న మహిళలను గుర్తించడానికి “ఇంట్లో మీరు సురక్షితంగా ఉన్నారా?” అనే చిన్న ప్రశ్న ఒక ప్రాణాన్ని కాపాడే మార్గాన్ని చూపుతుంది.
డాక్టర్ -రోగి బంధం:
రోగులు తమను జడ్జ్ చేస్తున్నారని భయపడకుండా ఉండటానికి.. డాక్టర్లు “మీ జీవితానికి సరిపోయే ప్రణాళికను సిద్ధం చేయడానికే నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నాను” అని స్పష్టం చేయడం ముఖ్యం.