E-Paper
Advertisement

డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. డ్రైవర్ ప్రాణాలు కాపాడిన టెస్లా ఫీచర్లు!

డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. డ్రైవర్ ప్రాణాలు కాపాడిన టెస్లా ఫీచర్లు!
Advertisement

రీసెంట్ గా ఓ వ్యక్తి రాత్రి సమయంలో టెస్లా Y మోడల్ కారులో అట్లాంటా నుంచి బర్మింగ్హామ్ వరకు బయల్దేరాడు.  కొంతదూరం వెళ్లగానే ఛాతిలో నొప్పి ప్రారంభం అయ్యింది. పరిస్థితి నెమ్మదిగా సీరియస్ అవుతోంది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో కారులో ఉన్న డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను ఆన్ చేశాడు. వెంటనే కారు కొంత మేరకు ఆటోమేటిక్ మోడ్ లోకి వెళ్లింది. వాహనం స్టీరింగ్‌ ను సరిగా ఉంచడం, వేగాన్ని నియంత్రించడం, లేన్‌ లోనే ప్రయాణించేలా సహాయపడటం లాంటి పనుల్లో సాయం అందించాయి. దీంతో ఆయన పూర్తిగా డ్రైవింగ్‌ చేస్తూ, ఒత్తిడికి గురికాకుండా ఉన్నాడు.

నేరుగా హాస్పిటల్ కు వెళ్లిన కారు

Advertisement

అదే సమయంలో ఆ కారు అసలు ఓనర్ అయిన ఆయన కొడుకు, టెస్లా యాప్ ద్వారా పరిస్థితిని గమనించాడు. వెంటనే ఆయన కారును దగ్గరలోని హాస్పిటల్ కు వెళ్లేలా రూట్ ఛేంజ్ చేశాడు. వెంటనే కారు దగ్గరలోని హాస్పిటల్ కు వెళ్లింది. అప్పటికే ఆయన కొడుకు హాస్పిటల్ కు విషయం చెప్పడంతో సిబ్బంది ఆయన కోసం ఎదురుచూశారు. ఆయన రాగానే వెంటనే, లోపలికి తీసుకెళ్లి చికిత్స మొదలు పెట్టారు. ఫలితంగా ఆయన ప్రాణాలు నిలబడ్డాయి. ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

పూర్తిగా ఆటోమేటిక్ మోడ్ లోకి కాకుండా..

టెస్లా డ్రైవర్ అసిస్టెన్స్ వ్యవస్థ పూర్తిగా ఆటోమేటిక్ డ్రైవింగ్ ను ఇవ్వదు. ఈ ఫీచర్ పని చేస్తున్న సమయంలో కూడా డ్రైవర్ స్టీరింగ్‌ పై చేతులు ఉంచి, ఎప్పటికప్పుడు వాహనంపై కంట్రోల్ కొనసాగించాల్సి ఉంటుంది. అవసరమైతే వెంటనే జోక్యం చేసుకునే బాధ్యత కూడా డ్రైవర్‌ పైనే ఉంటుంది. తాజాగా ఈ సంఘటన బయటకు రావడంతో చాలా మంది సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి ఆధునిక భద్రతా సాంకేతికతలు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆధునిక కార్లలో డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి ప్రమాదాలను తగ్గించడం, లేన్‌ లో వాహనం కొనసాగించడం, ముందున్న వాహనానికి తగిన దూరం పాటించడం లాంటి పనుల్లో సాయం చేస్తాయి. అయితే, ఇవి డ్రైవర్‌కు సహాయక వ్యవస్థలు మాత్రమే కానీ, డ్రైవర్ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేసే టెక్నాలజీ కాదు.  సరైన సమయంలో ఆధునిక భద్రతా ఫీచర్లు ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం పొందడం అత్యంత ముఖ్యమైనది. అలాగే, వాహనంలోని సేఫ్టీ ఫీచర్లను సరిగ్గా అర్థం చేసుకుని ఉపయోగించడం కూడా ప్రతి డ్రైవర్ బాధ్యత.

Read Also: వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

Related News

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

స్కోడా ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీ.. భారత్‌కు రానున్న 3 గ్లోబల్ మోడల్స్ ఇవే!

కవాసకి W230 vs యమహా XSR155.. ఈ రెండు రెట్రో బైక్‌లలో ఏది బెస్ట్?

నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టిన స్పైకర్.. అదిరిపోయే సూపర్‌ కార్‌ తో రీఎంట్రీ!

ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!

Big Stories

Advertisement
×