E-Paper
Advertisement

వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త లుక్ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

2026 Suzuki Wagon R Custom ZX Unveiled: జపాన్‌ లో సూపర్ ఫేమస్ అయిన సుజుకి వాగన్ ఆర్ ఇప్పుడు 2026 మోడల్‌ గా మరింత స్టైలిష్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. కస్టమ్ ZX ఫేస్‌ లిఫ్ట్ పేరుతో వచ్చిన ఈ టాప్ వేరియంట్‌ లో కొత్త డిజైన్, సూపర్ ఫీచర్లు, మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ లాంటి అప్‌ డేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా దీనిని రూపొందించారు.

ఇంజిన్ గురించి..

ఈ కొత్త వాగన్ ఆర్ కస్టమ్ ZXలో 660cc 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను అందించారు. దీనికి సుజుకి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ ను యాడ్ చేశారు. చిన్న లిథియం-అయాన్ బ్యాటరీ సాయంతో ప్యూయల్ వినియోగాన్ని తగ్గిస్తూ మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 49 హార్స్‌ పవర్ శక్తి, 58Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ ను CVT ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ద్వారా వీల్స్‌ కు పంపిస్తుంది. ఈ కారు ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో పాటు 4WD ఆప్షన్‌ లో కూడా లభిస్తుంది. ఈ కారు సిటీలో  లీటరుకు సుమారు 22 నుంచి 25 కిలోమీటర్లు, హైవేపై 25 నుంచి 28 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

డిజైన్, ఇంటీరియర్ గురించి..

Advertisement

డిజైన్ పరంగా కూడా ఈ ఫేస్‌ లిఫ్ట్ మోడల్‌ లో పలు మార్పులు చేశారు. ముందుభాగంలో కొత్త V-ఆకారపు క్రోమ్ గ్రిల్, స్లిమ్ LED హెడ్‌ ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ తో బోల్డ్ లుక్‌ను అందిస్తున్నాయి. 15 అంగుళాల డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కారుకు మరింత ప్రీమియం లుక్ ను అందించనున్నారు. ఇంటీరియర్‌ లో డార్క్ బ్లాక్ థీమ్‌ ను ఉపయోగించారు. లెదర్‌ తో కూడిన మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, హీటెడ్ డ్రైవర్ సీట్, మెరుగైన సౌండ్ ఇన్సులేషన్ వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. శబ్దం తక్కువగా ఉండేలా ప్రత్యేక సౌండ్ డ్యాంపింగ్ మెటీరియల్స్‌ ను  ఉపయోగించారు. ఈ కారు మంచి ఫీచర్లను అందిస్తుంది. 4.2 అంగుళాల డిజిటల్ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ ప్లే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆటో కార్ ప్లే, సుజుకి కనెక్ట్ లాంటటి స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

భద్రతకు పెద్దపీట

Advertisement

ఈ కారులో పలు కీలకమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 360 డిగ్రీ ఓమ్నిడైరెక్షనల్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు కూడా అందించారు. ఇరుకైన ప్రదేశాల్లో కూడా వాహనాన్ని సులభంగా పార్క్ చేయవచ్చు. డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్ II, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ తో పాటు ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ లు ఉన్నాయి. జపాన్ లో ఈ మోడల్ అందుబాటులోకి రాగా, ఇతర దేశాలకు ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: రూ.10.99 లక్షలకే క్రెటా ఎలక్ట్రిక్.. హ్యుందాయ్ షాకింగ్ ఆఫర్!

Related News

హోండా SP125 స్పెషల్ ఎడిషన్‌ కు గుడ్‌ బై.. వెబ్‌ సైట్ నుంచి మాయం!

కొత్త స్టైల్.. సరికొత్త కలర్స్.. రివోల్ట్ RVX వచ్చేసింది!

రూ.10.99 లక్షలకే క్రెటా ఎలక్ట్రిక్.. హ్యుందాయ్ షాకింగ్ ఆఫర్!

టాటా సియెర్రా ఈవీ vs MG విండ్సర్ ఈవీ.. రెండింటిలో ఏ SUV బెస్ట్ అంటే..?

180 కి.మీ రేంజ్.. రిమూవబుల్ బ్యాటరీ.. కీవే క్రేజీ స్కూటర్ వచ్చేసింది!

పల్సర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. N125 ఉత్పత్తి నిలిపివేత!

కొత్త కలర్స్‌ తో క్రేజీగా ఏథర్ 450X.. ఛార్జింగ్ కూడా ఇక సూపర్ ఫాస్ట్!

Big Stories

×