TEEJAN BAI: సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల మరణం అటు సినీ పెద్దలను, ఇటు అభిమానులను తీవ్ర దుఃఖంలో ముంచేస్తోంది. తమ అద్భుతమైన గాత్రంతో.. దర్శకత్వ మెళుకువలతో.. ఊహించని నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఎంతోమంది సెలబ్రిటీలు అనారోగ్య సమస్యలతో మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.అలా భారత జానపద కళా రంగంలో తన అపూర్వ గాత్రంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని.. పద్మశ్రీ , పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించబడిన ప్రముఖ పాండవాని గాయని తుది శ్వాస విడిచారు. ఈ విషయం సినీ సెలబ్రిటీలనే కాదు అటు భారత ప్రధానమంత్రి మోదీని కూడా విషాదంలోకి నెట్టివేసింది. దీంతో ఆమె ఎవరు? ఏ కారణం చేత ఆమె మరణించారు? ఇండస్ట్రీలో ఆమె ప్రస్థానం ఎట్టిది?ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
భారత జానపద కళా రంగంలో అపూర్వ గాత్రంతో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న తీజన్ బాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున రాయ్ పూర్ లోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచింది. ఈమె మరణించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. తెల్లవారుజామున సుమారుగా 3:15 గంటల సమయంలో ఈమె మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. తీజన్ బాయి మరణంతో జానపద సంగీత ప్రపంచం ఒక్క గొప్ప కళాకారిణిని కోల్పోయింది.
ఛత్తీస్ ఘడ్, సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన అరుదైన కళాకారిణిగా ఈమె చిరస్థాయిలో నిలిచిపోయారు. వాస్తవానికి తీజన్ బాయి పేరు చెప్పగానే..మనకు ముందుగా గుర్తొచ్చేది పాండవాని. ఇది ఛత్తీస్ ఘడ్ కు చెందిన అత్యంత ప్రాచీన జానపద గానా సాంప్రదాయం. మహాభారతంలోని కథలు, వీరగాథలు, పాత్రల భావోద్వేగాలు , సంగీత కథనం, నాట్యాభినయంతో కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఈ కళా ప్రక్రియ ప్రత్యేకత. గాత్రం , హావ భావాలు, రంగస్థలం ప్రదర్శనతో తీజన్ బాయి పాండవానికి ఒక కొత్త ఊపిరి పోసారు.
దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఈ కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చారు తీజన్ బాయి .. అలాంటి ఈమె అనారోగ్య సమస్యలతో కన్నుమూశారని తెలియడంతో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతికి శాంతి చేకూరాలి అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అంతేకాదు భారత ప్రధానమంత్రి మోడీ కూడా తీజన్ బాయ్ మరణానికి సంతాపం తెలియజేశారు.
తీజన్ బాయి విషయానికి వస్తే.. 1956 ఏప్రిల్ 24 న ఛత్తీస్గఢ్లోని భిలాయ్ సమీపంలోని గనియారి గ్రామంలో జన్మించారు. తల్లి పేరు సుఖ్ వతి కాగా, తండ్రి పేరు చినుక్ లాల్ పార్థి. షెడ్యూల్డ్ తెగకు చెందిన ఈమె.. చిన్ననాటి నుంచే జానపద కళలపై ఆసక్తి పెంచుకున్నారు. అలా కళ ప్రయాణానికి మొదటి గురువు అయినా తన తాత బ్రిజ్ లాల్ పార్థి.. చత్తీస్ ఘడ్ – హిందీ భాషల్లో సబల్ సింగ్ రచించిన మహాభారత కథలను ఆమెకు వినిపించేవారు. వాటిని ఆసక్తిగా విని..తనదైన శైలిలో మళ్లీ చెప్పడం ప్రారంభించారు. ఇక ఆమె ప్రతిభని గుర్తించి..కుటుంబ సభ్యుల ప్రోత్సహించగా ఇలా పాండవాని కళలో ఆమె శిక్షణ పొందారు. పురుషులే ప్రధానంగా ఈ కళను ప్రదర్శించే రోజుల్లో సామాజిక అడ్డంకులను అధిగమించి, తన ప్రత్యేకమైన ప్రదర్శన శైలితో పాండవానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చి, మహిళలు కూడా ఈ కళలో రాణించగలరు అని నిరూపించిన ఏకైక మహిళగా తీజన్ బాయి చరిత్ర సృష్టించారు. ఇక ఈమె జానపద సంగీత కళా రంగంలో చేసిన విశిష్ట సేవలకు అనేక జాతీయ , అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు.
also read: Kissik Talks: నిజాలు అక్కర్లేదు.. ఆరేళ్ల బంధంపై సోనియా ఊహించని కామెంట్!