E-Paper
Advertisement

Skoda Kylaq Special Offer: 50 వేల కార్ల అమ్మకం.. రూ.50 వేల తగ్గింపు.. స్కోడా గుడ్ న్యూస్!

Skoda Kylaq  Special Offer: 50 వేల కార్ల అమ్మకం.. రూ.50 వేల తగ్గింపు.. స్కోడా గుడ్ న్యూస్!
Advertisement

Skoda Kylaq  Feb 2026 Special Offer: స్కోడా కంపెనీ.. వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్కోడా కైలాక్ పై ఏకంగా రూ. 50 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ కారు 50 వేల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా కార్ల తయారీ సంస్థ క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. ఒక సంవత్సరం స్కోడా మెయింటెనెన్స్ ప్యాకేజీ పై 50 శాతం తగ్గింపును అందిస్తోంది. అదనంగా, కైలాక్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్‌కు బహుమతులు అందిస్తుంది. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28, 2026 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.  చెల్లుబాటులో ఉంటాయి.

అత్యంత వేగంగా 50 వేల యూనిట్ల అమ్మకాలు

కైలాక్ స్కోడా అత్యంత చౌకైన, అమ్మకానికి ఉన్న ఏకైక 4 మీటర్ల లోపు మోడల్ ఇది. ప్రసిద్ధ కాంపాక్ట్ SUV విభాగంలో పోటీగా దూసుకెళ్తోంది. ఇది స్కోడాకు ముఖ్యమైన మోడల్ గా మారింది. గత సంవత్సరం స్కోడా అమ్మకాలలో దాదాపు 62 శాతం వాటాను కలిగి ఉంది. గత సంవత్సరం GST సవరణలు, రూ. 40 లక్షల లోపు కార్లపై పన్ను రేటును తగ్గించి, ఈ నేపథ్యంలోనే కార్ల ధర తగ్గింపుకు కారణం అయ్యింది. ఇవి కైలాక్ అమ్మకాలను పెంచడానికి సాయపడ్డాయి. ఫలితంగా ఈ SUV ఇప్పుడు అత్యధికంగా అమ్ముడైన స్కోడాగా మోడల్ గా నిలిచింది. కేవలం 13 నెలల్లో 50,000 యూనిట్ల అమ్మకాలను  దాటింది. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న స్కోడా మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. డిమాండ్‌ను కొనసాగించడానికి, స్కోడా తన చకన్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం పెంచింది.

కొత్త ట్రిమ్ లలో స్కోడా కైలాక్

Advertisement

ఇటీవల ఈ చెక్ కార్ల తయారీ సంస్థ  కైలాక్ కోసం రెండు కొత్త ట్రిమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మోడల్ శ్రేణిలోని లోయర్, మిడ్ స్పెక్ ఆఫర్లకు మరిన్ని ఫీచర్లు, విలువను తీసుకువచ్చింది. స్కోడా ఈ సంవత్సరం చివర్లో కొత్త టాప్ ఆఫ్ ది లైన్ స్పోర్ట్‌ లైన్ ట్రిమ్‌ను కూడా విడుదల చేస్తుంది. ఇది కాస్మెటిక్ మార్పులతో స్పోర్టియర్ లుకింగ్ వేరియంట్‌ గా ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: హ్యుందాయ్ కళ్లు చెదిరే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. లక్ష తగ్గింపు!

కైలాక్ ధర ఎంత అంటే?

Advertisement

ఈ కాంపాక్ట్ SUV 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదంట, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో యాడ్ చేయబడి ఉంటుంది. కైలాక్ ధరలు రూ. 7.59 లక్షల నుంచి రూ. 12.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. వోక్స్ వ్యాగన్ 2027 లో కైలాక్ బ్యాడ్జ్ ఇంజనీరింగ్ వెర్షన్‌ ను కూడా విడుదల చేస్తుంది.

Read Also: టాటా ఈవీలపై అదిరిపోయే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. 3.80 లక్షల తగ్గింపు!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×