E-Paper
Advertisement

టాటా To ఎంజీ.. రూ.15 లక్షల లోపు టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

టాటా To ఎంజీ.. రూ.15 లక్షల లోపు టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Best EVs Under Rs.15 Lakh in 2026: భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రోజూ ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గించేందుకు EV కార్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఛార్జింగ్ స్టేషన్లు పెరగడం,  తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు కారణంగా ఎలక్ట్రిక్ కార్లను బెస్ట్ ఆప్షన్ గా భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.15 లక్షల లోపు మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో కూడిని 5 ఈవీల గురించి చూద్దాం..

⦿ MG విండ్సర్ EV

MG విండ్సర్ EV  ధర సుమారు రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) మోడల్ కూడా అందిస్తోంది. ఇందులో తక్కువ ప్రారంభ ధరతో కారు కొనుగోలు చేసి, బ్యాటరీ వినియోగానికి కిలోమీటర్‌ ఆధారంగా డబ్బులు చెల్లించవచ్చు. ఈ కారు 38kWh, 52.9kWh బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 449 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

⦿ మహీంద్రా XUV 3XO EV

Advertisement

మహీంద్రా XUV 3XO EV సిటీ ప్రయాణాలకు సరిపోయే ఎలక్ట్రిక్ SUVగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీని ధర సుమారు రూ.13.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారులో ADAS భద్రతా ఫీచర్లు, 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. రద్దీ నగర రోడ్లలో సులభంగా డ్రైవ్ చేయడానికి అనువుగా ఉండే ఈ SUV, సుమారు 350 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

⦿ టాటా నెక్సాన్ EV

టాటా నెక్సాన్ EV భారత మార్కెట్లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ.12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 30kWh, 45kWh బ్యాటరీ ఆప్షన్స్ తో వస్తుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్‌  ఒకే ఛార్జ్ తో దాదాపు 489 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని టాటా ప్రకటించింది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వెంటిలేటెడ్ సీట్లు, మంచి భద్రతా రేటింగ్స్ లాంటి  ఫీచర్లు కుటుంబ ప్రయాణాలకు కూడా అనువుగా ఉంటాయి.

⦿ సిట్రోయెన్ eC3

Advertisement

సిట్రోయెన్ eC3 సిటీ ప్రయాణాలకు సరిపోయే చౌకైన EV.  దీని ధర రూ.12.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 29.2kWh బ్యాటరీతో వచ్చే ఈ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. చిన్న కుటుంబాల రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

⦿ టాటా పంచ్ EV

ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లలో టాటా పంచ్ EV ఒకటి. దీని ధర రూ.9.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. BaaS మోడల్ ద్వారా మరింత తక్కువ ప్రారంభ ధరలో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. 30kWh, 40kWh బ్యాటరీ ఎంపికలతో వచ్చే ఈ SUV, గరిష్టంగా 468 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

Read Also: త్వరలో 4 క్రేజీ ఈవీల ఎంట్రీ.. మార్కెట్‌ షేక్ అవ్వాల్సిందే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×