Faceless Services: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో సారథి మాడ్యూల్‌కు సంబంధించిన పలు ఫేస్‌లెస్ సేవలను విజయవంతంగా ఆన్‌లైన్ విధానంలోకి తీసుకువచ్చింది. ప్రజలకు సారధి మాడ్యూల్ ను అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. డిజిటల్ పరిపాలనను బలోపేతం చేయడం, ప్రజా కేంద్రిత సేవలను మరింత సులభతరం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా, ఈ ఫేస్‌లెస్ సేవల ద్వారా ఆధార్ ధృవీకరణ ఆధారంగా పౌరులు రవాణా శాఖ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే సేవలను పొందవచ్చని తెలిపారు.అవసరమైన ధృవీకరణలు, చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం సారథి వెబ్‌సైట్‌లో 17 సేవలను అందుబాటులో ఉంచామని, రాబోయే 3 రోజులలో ఈ సేవలను NextGen mParivahan మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
Also read: కోహ్లీకి అంతా బలుపెందుకు ? ఆటోగ్రాఫ్ కోసం లక్ష కోట్ల అధిపతి సంజీవ్ గోయెంకాను నిలబెడతావా !
లర్నర్ లైసెన్స్‌లో చిరునామా, పేరు మార్పు, ఫోటో, సంతకం మార్పు, డూప్లికేట్ లర్నర్ లైసెన్స్ జారీ, లర్నర్ లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, డ్రైవింగ్ లైసెన్స్ ప్రతిస్థాపన, డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు, డ్రైవింగ్ లైసెన్స్‌లో పేరు మార్పు, డ్రైవింగ్ లైసెన్స్‌లో బయోమెట్రిక్ మార్పులు, డ్రైవింగ్ లైసెన్స్‌లో జన్మతేది మార్పు, డ్రైవింగ్ లైసెన్స్‌లో ఫోటో-సంతకం మార్పు, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్, లైసెన్స్ నుంచి వాహన తరగతి తొలగింపు, ప్రమాదకర పదార్థాల రవాణా వాహనాలు నడిపేందుకు ఎండోర్స్‌మెంట్, డూప్లికేట్ పబ్లిక్ సర్వీస్ వెహికల్ (పీఎస్వీ) బ్యాడ్జ్ జారీ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఈ ఫేస్‌లెస్ సేవల అమలు రాష్ట్రంలో డిజిటల్ పరిపాలనను మరింత బలోపేతం చేయడంలోనూ, రవాణా సంబంధిత పౌర సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందించడంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని వెల్లడించారు. ప్రజలు Sarathi Portal లో సేవలను పొందవచ్చన్నారు. సాంకేతిక ఆధారిత సేవల ద్వారా ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు రవాణా శాఖ కట్టుబడి ఉందని కమిషనర్ తెలిపారు.
Also read: కార్లపై కులం పేర్లు ఉంటే ఇక చుక్కలే, కొత్త రూల్ తీసుకొచ్చిన సర్కారు!