Upcoming EV Launches 2026: భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ మరింత వేగంగా విస్తరిస్తోంది. పెద్ద కంపెనీలు కొత్త EVలను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. చిన్న కార్ల నుంచి ప్రీమియం SUVల వరకు పలు మోడళ్లను మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నాయి. ఎక్కువ రేంజ్, అత్యాధునిక టెక్నాలజీ, ఆకట్టుకునే ఫీచర్లు, మెరుగైన పనితీరుపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. 2026లో ఎక్కువగా ఆసక్తి కలిగిస్తున్న నాలుగు టాప్ EVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా మోటార్స్ తన పాపులర్ మోడల్ సియెర్రాను ఎలక్ట్రిక్ SUV రూపంలో తీసుకువస్తుంది. కర్వ్ EV కంటే ప్రీమియం స్థాయిలో ఈ వాహనం ఉండే అవకాశం ఉంది. ఈ కారు ఫుల్ ఛార్జ్ తో సుమారు 450 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. డిజైన్ పరంగా పాత సియెర్రాస్టైలింగ్ ఉండగా, లోపల అత్యాధునిక టెక్నాలజీ, పెద్ద టచ్ స్క్రీన్, కనెక్టెడ్ ఫీచర్లు ఇవ్వనున్నారు.
ఇది కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్ ను లక్ష్యంగా చేసుకుని రాబోతోంది. సిటీ ప్రయాణాలకు అనువుగా చిన్న సైజులో ఈ మోడల్ ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్ తో పాటు సరిపడే రేంజ్‌ను అందించనుంది. కియా కంపెనీ ఇప్పటికే భారత మార్కెట్లో మంచి స్థానం సంపాదించడంతో, ఈ EVపై కూడా అంచనాలు పెరిగాయి. డిజైన్ లో క్లోజ్డ్ గ్రిల్, కొత్త LED లైట్లు, డిజిటల్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇది టాటా నెక్సాన్ EV లాంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.
రోజువారీ సిటీ ప్రయాణాల కోసం చిన్న ఎలక్ట్రిక్ కారుగా దీనిని తీసుకొస్తున్నారు. ఎంట్రీ లెవల్ EVగా దీన్ని మార్కెట్ కు పరిచయం చేయనున్నారు. 40 నుంచి 50kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. పూర్తి ఛార్జ్ తో 300 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. కాంపాక్ట్ డిజైన్ కారణంగా ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో సులభంగా నడపవచ్చు. లోపల డిజిటల్ డిస్ ప్లే లు, కనెక్టెడ్ ఫీచర్లు ఇవ్వనున్నారు. ఇది టాటా పంచ్ EV, సిట్రోయెన్ eC3లకు పోటీగా నిలవనుంది.
ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా మార్కెట్లోకి రానుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ లతో తీసుకురానున్నారు. పూర్తి ఛార్జ్ తో సుమారు 570 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని సమాచారం. ఇందులో రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లు కూడా ఉండే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ఇది చాలా ఆధునికంగా కనిపిస్తుంది. పెద్ద టచ్ స్క్రీన్, డిజిటల్ కాక్ పిట్, అడ్వాన్స్ డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో తక్కువ సమయంలో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.
Read Also: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఇంట్లో ఛార్జింగ్ కోసం ఏమేమి అవసరం?