E-Paper
Advertisement

34 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ కారు.. ధర కేవలం రూ. 3.69 లక్షలే!

34 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ కారు.. ధర కేవలం రూ. 3.69 లక్షలే!
Advertisement

Best Budget Cars 2026: భారతీయ కారు మార్కెట్ లో SUVలు ట్రెండ్‌లో ఉన్నప్పటికీ, హ్యాచ్‌ బ్యాక్ కార్లకు ఇంకా మంచి  డిమాండ్ ఉంది. తక్కువ ధర, మంచి మైలేజ్, సిటీలో ఈజీగా డ్రైవ్ చేయగలిగే ఫీచర్లు చాలా మందికి ఫస్ట్ చాయిస్‌ గా మారుతున్నాయి. మార్చి 2026లో ఏకంగా 87,000కు పైగా హ్యాచ్‌ బ్యాక్‌ లు అమ్ముడయ్యాయి అంటే.. ఈ సెగ్మెంట్ ఎంత పాపులర్‌ అనేది అర్థం చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌ లో మంచి మైలేజ్ ఇచ్చే కారును వెతుకుతున్నట్లయితే, ఈ టాప్ 5 మోడల్స్ ను ఓసారి చెక్ చేయండి.

⦿ మారుతి వాగన్ ఆర్

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇవ్వడంలో మారుతి వాగన్ ఆర్ ముందుంటుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌ బ్యాక్‌ గా కొనసాగుతోంది. టాల్ బాయ్ డిజైన్ తో లోపల ఎక్కువ ప్లేస్ ఉంటుంది.  కుటుంబంతో ప్రయాణించే వారికి  చాలా సౌకర్యంగా ఉంటుంది. పెట్రోల్, CNG ఆప్షన్లలో లభిస్తుంది. CNG వేరియంట్‌ లో సుమారు 34 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ. 5.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

⦿ మారుతి బాలెనో

Advertisement

మారుతి బాలెనో కూడా ఈ లిస్టులో ఉంటుంది. స్టైలిష్ డిజైన్‌ తో పాటు ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. పెద్ద టచ్‌ స్క్రీన్, హెడ్ అప్ డిస్‌ ప్లే లాంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. లోపల మంచి స్పేస్ ఉంటుంది. ఇది సుమారు 22–23 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ. 6.6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

⦿ మారుతి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్ ఎవర్ గ్రీన్ పాపులర్ మోడల్. స్పోర్టీ లుక్, స్మూత్ హ్యాండ్లింగ్ తో యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇది సుమారు 22–24 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ధర సుమారు రూ. 6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అమ్మకాలు కొంచెం తగ్గినా, ఇంకా ఇది టాప్‌లోనే కొనసాగుతోంది.

⦿ మారుతి ఆల్టో K10

Advertisement

బడ్జెట్‌ లో బెస్ట్ ఆప్షన్ మారుతి ఆల్టో K10. ఇది దేశంలో అత్యంత చౌకైన కార్లలో ఒకటి. కేవలం రూ. 3.69 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. మొదటిసారి కారు కొనేవారికి ఇది మంచి ఆప్షన్. పెట్రోల్, CNG ఆప్షన్లలో లభించే ఈ కారు, 33–34 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.

⦿ టాటా టియాగో

మారుతి కాకుండా మరో మంచి ఆప్షన్ టాటా టియాగో. మంచి నిర్మాణం, చక్కటి భద్రతా రేటింగ్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈజీ రైడ్ క్వాలిటీ ఆకట్టుకుంటుంది. పెట్రోల్, CNG ఆప్షన్లలో లభిస్తుంది. సుమారు రూ.5.6 లక్షల ప్రారంభ ధరతో  అందుబాటులో ఉంది. టియాగో EV వెర్షన్ కూడా అందుబాటులో ఉండటం మరో ప్లస్.  హ్యాచ్‌ బ్యాక్ కార్లు భారత మార్కెట్లో ఇప్పటికీ సత్తా చాటుతున్నాయి. తక్కువ ధరలో, మంచి మైలేజ్‌ తో, సిటీలో ఈజీగా  వాడుకునే వెహికల్ కావాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ గా మారుతున్నాయి.

Read Also: ఒకటి కాదు రెండు కాదు.. మార్కెట్ ను షేక్ చేయబోతున్న10 క్రేజీ బైక్స్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×