E-Paper
Advertisement

Best-Selling Royal Enfield Bikes: అమ్మకాల్లో దుమ్మురేపిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

Best-Selling Royal Enfield Bikes: అమ్మకాల్లో దుమ్మురేపిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?
Advertisement

Best-Selling Royal Enfield Bikes 2025: 2025 క్యాలెండర్ ఇయర్‌ లో జనవరి నుంచి డిసెంబర్ 17 వరకు అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా.. దేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. GST తగ్గింపు, ఫెస్టివల్ సీజన్, న్యూ మోడల్ అప్‌ డేట్స్ కారణంగా 350cc సెగ్మెంట్ డామినేట్ చేసింది. టాప్ 5 అత్యధికంగా అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ క్లాసిక్ 350 (Classic 350)

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇండియా అత్యధికంగా అమ్మిన క్రేజీ బైక్ క్లాసిక్ 350 .  దేశంలోనే నంబర్ 1 బెస్ట్ సెల్లర్ గా గుర్తింపు తెచ్చుకుంది. సెప్టెంబర్ 2025లోనే ఏకంగా 40,000+ యూనిట్లు అమ్ముడయ్యాయి. సంవత్సరం మొత్తం ఎక్కువ వాల్యూమ్ ఇదే నమోదు చేసింది. సుమారు 5 లక్షలకు పైగా బైక్ లు అమ్ముడయ్యాయి.

⦿ బుల్లెట్ 350 (Bullet 350)

Advertisement

ఐకానిక్ హెరిటేజ్ మోడల్ కూడా అమ్మకాల్లో దుమ్మురేపింది. సెప్టెంబర్‌లో బుల్లెట్ 350 బైక్ ఏకంగా 26,000 యూనిట్ల అమ్మకాలు కొనసాగించింది. ఏడాది అంతా భారీ గ్రోత్ చూపించింది. 2025లో సుమారు 3 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.

⦿ హంటర్ 350 (Hunter 350)

యంగ్ రైడర్స్‌ లో పాపులర్, అర్బన్ ఫ్రెండ్లీ హంటర్ 350 కూడా బాగానే అమ్మకాలు జరపుకుంది. సెప్టెంబర్‌ లో ఈ బైక్ ఏకంగా 22,000 యూనిట్లు సేల్ అయ్యాయి. మొత్తం సంవత్సరంలో 5 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడైన ఏకైక మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ మీటియర్ 350 (Meteor 350)

Advertisement

క్రూయిజర్ సెగ్మెంట్ లీడర్ మీటియర్ 350 కూడా అమ్మకాల్లో సత్తా చాటింది. 2025 అప్‌ డేట్ తర్వాత గ్రోత్ పెరిగింది.  సెప్టెంబర్‌ లో ఈ బైక్ 14,000+ యూనిట్లు సేల్ అయ్యాయి. ఇయర్ మొత్తంలో 1.5 లక్షల బైక్స్ అమ్ముడయ్యాయి.

⦿ హిమాలయన్ 450 (Himalayan 450)

అడ్వెంచర్ సెగ్మెంట్‌లో హిమాలయన్ 450  బెస్ట్ పెర్ఫార్మర్ గా నిలవడమే కాకుండా, అమ్మకాల్లోనూ జోష్ కనబరిచింది. సెప్టెంబర్‌లో టాప్ 5లోకి వచ్చింది. ఒక్క నెలలో ఏకంగా 4,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రీమియం మోడల్స్‌ లో ఈ బైక్ అత్యధిక గ్రోత్ చూపించింది.

Read Also: TVS నుంచి రాబోతున్న 4 బైక్‌లు.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

మొత్తంగా ఈ 5 బైక్స్ ఇండియాలో మంచి అమ్మకాలు కొనసాగించాయి. ఈ ర్యాంకింగ్  ఏప్రిల్-నవంబర్ 2025  సేల్స్ రిపోర్ట్స్, ట్రెండ్స్, పోర్టల్స్ డేటా ఆధారంగా రూపొందించబడింది. మొత్తం సంవత్సరం కచ్చితమైన మోడల్ వైజ్ అధికారిక లెక్కలు ఇంకా విడుదల కాలేదు. డిసెంబర్ 2025 డేటా పెండింగ్ లో ఉంది. ఈ ఏడాది రాయల్ ఎన్‌ఫీల్డ్ 350cc మోడల్స్ మొత్తం 85-90% అమ్మకాలతో టాప్ ప్లేస్ లో నిలిచాయి. ఫెస్టివల్ సీజన్ అయిన సెప్టెంబర్-నవంబర్ లో రికార్డు స్థాయిలో అమ్మకాలు కొనసాగాయి. నెలకు ఏకంగా 1.2 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి.

Read Also:  లాంచ్ కు రెడీ అవుతున్న4 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు, ఒక్కోదాని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×