E-Paper
Advertisement

Dimple Cheeks: సొట్టబుగ్గల అమ్మాయిలు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారో తెలుసా?

Dimple Cheeks: సొట్టబుగ్గల అమ్మాయిలు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారో తెలుసా?
Advertisement

మన శారీరక లక్షణాల ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని చెబుతారు నిపుణులు. కొంతమంది అమ్మాయిలకు నవ్వితే చాలు చెంపల్లో సొట్టలు పడతాయి. ఇవి వ్యక్తిని మరింత అందంగా, ఆకర్షణీయంగా చూపిస్తాయి. సొట్టబుగ్గలున్న వ్యక్తుల వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటుంది. సొట్టబుగ్గలున్న అమ్మాయిలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. వారు నవ్వినపుడు చుట్టుపక్కల ఉన్నవారి మనసు హత్తుకునేలా ఉంటుంది. వీరి నవ్వు చాలా సులభంగా మనసును దోచేస్తుంది. చాలామంది ఇలా సొట్టలు పడే వ్యక్తులను అదృష్టవంతులని అంటారు. వీరి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

పెళ్లి, కుటుంబ జీవితం
సొట్టబుగ్గలున్న అమ్మాయిలు మంచి భార్యగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి సహనం, ప్రేమ, శ్రద్ధ ఇతరులతో, ముఖ్యంగా భర్తకు పట్ల ఎక్కువగా ఉంటుంది. వీరు కుటుంబానికి, పెద్దలకూ గౌరవంతో వ్యవహరిస్తారు. వైవాహిక జీవితంలో వారు బాధ్యతాయుతంగా ఉంటారు. ఆత్మీయ సంబంధాలను బలంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. సొట్టబుగ్గలున్న అమ్మాయిలు కోడలిగా లభించే కుటుంబంలో ఆనందం, సౌభాగ్యం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

వ్యక్తిత్వ లక్షణాలు
సొట్టబుగ్గలున్నవారిని పరిశీలిస్తే, వారు సహజంగా ఉల్లాసంగా, స్నేహపూర్వకంగా ఉండే స్వభావం కలిగి ఉంటారని తెలుస్తోంది. వారు చాలా ఓపెన్‌గా ఉంటారు, ఆత్మవిశ్వాసంతో, జీవితాన్ని సానుకూల దృష్టితో చూస్తారు. సమస్యలను భయపడి దూరంగా కాకుండా, ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇతరుల సమస్యలపట్ల కూడా సహనం, దయ చూపిస్తారు. కొన్ని పూర్వకాల సంప్రదాయాలలో, సొట్టబుగ్గలు ఉన్న వ్యక్తులను అదృష్టం, మంచి జీవిత లక్షణం కలిగి ఉన్నవారిగా భావించేవారు. ఈ విశ్వాసం కొంతమేర నిజానికి నమ్మకాన్ని ఇస్తుంది.

సొట్టబుగ్గలు సైన్సు పరంగా చూస్తే వారసత్వంగా వస్తాయి. అంటే, మీ తల్లి, తండ్రికి సొట్టబుగ్గలు ఉంటే, మీకూ రావడం సాధారణం. ఇది డోమినెంట్ జీన్ కారణంగా వస్తుంది. అందువల్ల ఒక కుటుంబంలో పలు తరాల వారసులలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. కండరాల నిర్మాణంలో తేడాల వల్ల కూడా కొంతమందిలో ఇలా చెంపల్లో సొట్టలు పడే అవకాశం ఉంది. చెంపల కింద ఉండే మసిల్ (zygomaticus major muscle) కొంతమంది వ్యక్తులలో సాధారణం కాకుండా రెండుగా విడిపోయి ఏర్పడుతుంది. దీనివల్ల నవ్వినప్పుడు ఆ మసిల్ రెండు విడిపోయిన చోట లోతుగా ఏర్పడి సొట్ట బుగ్గలు కనిపిస్తాయి. ఏదేమైనా సొట్ట బుగ్గలు మాత్రం ముఖానికి ప్రత్యేక ఆకర్షణను, అందాన్ని ఇస్తాయి. అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి.

Related News

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

మీ దాంపత్య జీవితంలో గొడవలు ఎప్పుడూ ఉండవు.. ప్రేమ మరింత పెరుగుతుంది.. ఈ టిప్స్ పాటిస్తే

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

Big Stories

Advertisement
×