Best Bikes for Riding With Parents: బైక్ మీద కుటుంబ సభ్యులతో ప్రయాణించేటప్పుడు వేగం, లుక్ మాత్రమే కాకుండా సౌకర్యానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా తల్లిదండ్రులను వెనుక కూర్చోబెట్టుకుని తీసుకెళ్లేటప్పుడు సీటు వెడల్పు, కుషనింగ్, సస్పెన్షన్, గ్రాబ్ రైల్ లాంటి అంశాలు కీలకంగా మారతాయి. గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా ఉండే రోడ్లపై వెనుక కూర్చున్న వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అలాంటి 5 టాప్ బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రోజువారీ ప్రయాణాలకు హోండా యూనికార్న్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇందులో పొడవైన, ఫ్లాట్ సీటు ఉండటంతో రైడర్‌తో పాటు వెనుక కూర్చునే వారికి కూడా మంచి స్థలం లభిస్తుంది. సీటు కుషనింగ్, సౌకర్యవంతమైన ఫుట్‌పెగ్ పొజిషన్ ప్రయాణాన్ని ఈజీ చేస్తాయి. దీని సస్పెన్షన్ గుంతలు, ఎగుడుదిగుడుగా ఉండే రోడ్లపై కుదుపులను తగ్గించడంలో పడుతుంది.
సాధారణ కమ్యూటర్ బైక్‌కు భిన్నంగా ఉండే మోడల్ కావాలనుకునేవారు టీవీఎస్ రోనిన్‌ను ట్రై చేయవచ్చు. దీని రైడింగ్ పొజిషన్ సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, తక్కువ వేగాల్లోనూ ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది. రైడర్, పిలియన్ ఇద్దరికీ చక్కటి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. బ్యాక్ రెస్ట్ వృద్ధ ప్రయాణికులకు మరింత అనుకూలంగా ఉంటుంది.
క్లాసిక్ డిజైన్‌తో పాటు నిటారుగా కూర్చునే సౌకర్యం బుల్లెట్ 350 ప్రత్యేకతలు. దీని సీటు, రోడ్డుపై స్టెబులిటీ కుటుంబ సభ్యులతో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే, ఈ బైక్ బరువు ఎక్కువగా ఉంటుంది. వెనుక ప్రయాణికుడు ఉన్నప్పుడు తక్కువ వేగంతో మలుపులు తీసుకోవడం, బైక్‌ను బ్యాలెన్స్ చేయడం కొంత కష్టంగా ఉండవచ్చు.
వైబ్రేషన్లు, ఆకస్మిక కుదుపులు తక్కువగా ఉండాలని కోరుకునేవారికి హోండా హెచ్‌నెస్ CB350 మంచి ఆప్షన్. దీని ఇంజిన్ సున్నితంగా పనిచేయడంతో పాటు, సస్పెన్షన్ గుంతలు, స్పీడ్ బ్రేకర్లపై ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడంలో సాయపడుతాయి. విశాలమైన సీటింగ్ కూడా ఇద్దరు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది.
అత్యాధునిక-రెట్రో లుక్‌తో ఆకట్టుకునే జావా 42 FJ కూడా మంచి సీటుతో ఆకట్టుకుంటుంది. దీని రైడింగ్ పొజిషన్ సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, వెనుక సస్పెన్షన్ కొన్నిసార్లు గట్టిగా అనిపించవచ్చు. సస్పెన్షన్ ప్రీలోడ్‌ను తగిన విధంగా సర్దుబాటు చేయడం, అవసరమైతే బ్యాక్‌రెస్ట్ ఏర్పాటు చేయడం వల్ల పిలియన్ సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది.
Read Also: ఏప్రిలియా RS 660 స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది, రేసింగ్ లుక్ అదుర్స్!