E-Paper
Advertisement

‘ఆ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తే లేదు’.. జేడీయూ వేటుపై అనంత సింగ్ ఫైర్!

‘ఆ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తే లేదు’.. జేడీయూ వేటుపై అనంత సింగ్ ఫైర్!
Advertisement

Anant Singh: బిహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనంత్ సింగ్ పై జేడీయూ పార్టీ వేటు వేసింది. క్రమశిక్షణా రాహిత్యం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో అనంత సింగ్‌తో పాటు ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే నీలమ్ దేవిపై కూడా జేడీయూ ఆరేళ్ల పాటు బహిష్కరించింది. అయితే పార్టీ నిర్ణయంపై స్పందించిన అనంత్ సింగ్.. తనను తొలగించడం పట్ల ఎలాంటి విచారం లేదని స్పష్టం చేశారు. జేడియూ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదని, రాబోయే ఎన్నికల్లో ఆ విషయం తేలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలే తనకు దేవుళ్లని, వారు తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను సిద్ధంగా ఉంటానని అనంత్ సింగ్ పేర్కొన్నారు. జేడియూ కేవలం నితీశ్ కుమార్ పార్టీ అని ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం తగ్గడంతో పార్టీ ఉనికి కూడా ముగిసినట్లేనని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పార్టీని తమ గుప్పిట్లో ఉంచుకున్న కొందరు నేతలే ఈ బహిష్కరణ నిర్ణయం వెనుక ఉండి ఉంటారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో జేడియూకి ఘోర ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

Advertisement

అయితే తానెప్పుడు పార్టీ టికెట్ కోసం చేతులు చాచలేదని అనంత్ సింగ్ అన్నారు. త్వరలోనే సొంతంగా ఒక పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నానని బాంబ్ పేల్చారు. మరోవైపు నితీశ్ కుమార్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు, గొడవలు లేవని.. భవిష్యత్తులో తాను ఏ పార్టీలో చేరినా ఆయనపై విమర్శలు చేయనని స్పష్టం చేశారు. వీలైతే నితీశ్ కుమార్‌ను మళ్లీ కలుస్తానని చెప్పారు.

Also Read:  ఫ్లిప్‌కార్ట్ పార్సిల్స్ చోరీ.. కస్టమర్ల ఆర్డర్లతో డెలివరీ ఏజెంట్ జంప్.. చివరికి ఎలా దొరికాడంటే!

Advertisement

ఇటీవల జరిగిన బిహార్ శాసనమండలి ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమే అనంత్ సింగ్ బహిష్కరణకు ప్రధాన కారణమని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ కుష్వాహా తెలిపారు. పార్టీ ఆదేశాలను పదే పదే ఉల్లంఘించడం, అగ్రనాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఆరేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్‌కు జేడీయూ లేఖ రాసింది.

Also Read: స్లీప్ మోడ్‌లో ల్యాప్‌టాప్ పెడుతున్నారా? వెంటనే ఆపండి.. లేదంటే తప్పదు భారీ మూల్యం!

Tags

Related News

6 నెలలు.. 23 ఉరిశిక్షలు.. సంచలన జడ్జి రవికుమార్ దివాకర్ సడన్ ట్రాన్స్‌ఫర్!

12 ఏళ్ల ‘మన్ కీ బాత్’ ప్రయాణం.. దీన్ని ‘తీర్థయాత్ర’తో పోల్చిన ప్రధాని మోదీ!

ఫ్లిప్‌కార్ట్ పార్సిల్స్ చోరీ.. కస్టమర్ల ఆర్డర్లతో డెలివరీ ఏజెంట్ జంప్.. చివరికి ఎలా దొరికాడంటే!

సంచలనం రేపుతున్న సెన్సార్ బోర్డ్‌ డేటా లీక్.. 500 చిత్రాలకు రికార్డులు బయటకు

భర్త విద్యార్థి అయినా భార్యకు భరణం ఇవ్వాల్సిందే.. హై కోర్టు షాకింగ్ తీర్పు

కోపంతో మరిది ప్రైవేటు పార్ట్స్ కొరికిన వదిన, ఎన్నికుట్లు పడ్డాయంటే, యూపీలో షాకింగ్ ఘటన

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే

Big Stories

Advertisement
×