E-Paper
Advertisement

షాపింగ్ నుంచి రోజువారీ అవసరాల వరకు.. బెస్ట్ స్టోరేజ్ EV స్కూటర్లు ఇవే!

షాపింగ్ నుంచి రోజువారీ అవసరాల వరకు.. బెస్ట్ స్టోరేజ్ EV స్కూటర్లు ఇవే!
Advertisement

5 Electric Scooters With Maximum Storage: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా, తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం ఉండటంతో చాలా మంది ఈవీలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం తయారీదారులు కేవలం రేంజ్ మాత్రమే కాకుండా ప్రాక్టికాలిటీపై కూడా ఎక్కువ దృష్టి పెట్టుతున్నారు. ముఖ్యంగా షాపింగ్, కిరాణా సామాగ్రి, లగేజీ లాంటి రోజువారీ అవసరాలను తీసుకెళ్లడానికి సరైన స్టోరేజ్ సామర్థ్యం ఉన్న స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. భారత మార్కెట్లో ఎక్కువ బూట్ స్పేస్ కలిగిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.ఏథర్ రిజ్టా

ఈ లిస్టులో ఏథర్ రిజ్టా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇది ఫ్యామిలీ అవసరాలకు అనుగుణంగా తయారు చేశారు. ఇందులో మొత్తం 56 లీటర్ల స్టోరేజ్ ఉంది. సీటు కింద 34 లీటర్ల స్థలం ఉండగా, అదనంగా 22 లీటర్ల ఫ్రంక్ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల రోజువారీ కిరాణా, ప్రయాణ వస్తువులు సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ స్కూటర్ గరిష్టంగా 159 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. దీని ధర సుమారు రూ.1.21 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

2.రివర్ ఇండీ

Advertisement

రెండవ స్థానంలో రివర్ ఇండీ స్కూటర్ ఉంది. దీనిని  స్కూటర్ SUVగా కూడా పిలుస్తారు. మొత్తం 55 లీటర్ల స్టోరేజ్ ఇందులో ఉంది. 43 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్‌ తో పాటు 12 లీటర్ల గ్లోవ్ బాక్స్ కూడా ఉంటుంది. పెద్ద ఫ్లాట్ ఫ్లోర్‌ బోర్డ్ కారణంగా వస్తువులు తీసుకెళ్లడం మరింత సులభం అవుతుంది. ఇది సుమారు 160 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ధర దాదాపు రూ.1.52 లక్షల వరకు ఉంటుంది.

3.బజాజ్ చేతక్ C3501

మూడవ స్థానంలో బజాజ్ చేతక్ C3501 ఉంది. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌ లో మంచి గుర్తింపు పొందింది. ఇందులో 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. రోజువారీ అవసరాలకు సరిపడే స్థలాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్ సుమారు 153 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. దీని ధర రూ.1.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

4.ఓలా S1 ప్రో+

Advertisement

నాలుగవ స్థానంలో ఓలా S1 ప్రో+ ఉంది. ఈ ఫ్లాగ్‌ షిప్ మోడల్‌ లో 34 లీటర్ల స్టోరేజ్ ఉంది. పెద్ద బ్యాటరీ ఆప్షన్లతో ఇది సుమారు 320 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. వేగం, టెక్నాలజీ, కనెక్టివిటీ ఫీచర్లలో ఇది ముందంజలో ఉంటుంది. దీని ధర సుమారు రూ.1.24 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

5.TVS ఆర్బిటర్

ఎక్కువ బూట్ స్పేస్ కలిగిన ఈవీలలో TVS ఆర్బిటర్ అయిదవ స్థానంలో ఉంది. అందుబాటు ధరలో వచ్చే ప్రాక్టికల్ EV స్కూటర్‌ గా గుర్తింపు  పొందింది. ఇందులో కూడా 34 లీటర్ల స్టోరేజ్ ఉంది. కిరాణా సామాగ్రి, షాపింగ్ బ్యాగులు తీసుకెళ్లడానికి ఉపయోగకరంగా ఉంటుంది. రివర్స్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్ లాంటి  ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.84,999 నుంచి ప్రారంభమవుతుంది.

Read Also: సూపర్‌ మ్యాన్ థీమ్‌ తో స్టడ్స్ కొత్త హెల్మెట్.. ఐదు కలర్ ఆప్షన్లతో లాంచ్!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×