E-Paper
Advertisement

వేల కోట్ల స్కామ్ లో సన్నీ లియోన్.. కర్ణాటక సీఐడీ నోటీసులు..

వేల కోట్ల స్కామ్ లో సన్నీ లియోన్.. కర్ణాటక సీఐడీ నోటీసులు..
Advertisement

Sunny Leone : బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నిలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒకవైపు బాలీవుడ్ సినిమాలు, స్పెషల్ షోలతో పాటుగా తెలుగులో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది. అంతేకాదు ఆ మధ్య ఓ వివాదంలో చిక్కుకుంది. అది మర్చిపోకముందే ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడినట్లు ఓ వార్త బాలీవుడ్ మీడియా వర్గాల్లో కోడై కూస్తుంది. అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. ‘శివం అసోసియేట్స్’ భారీ ఆర్థిక కుంభకోణంలో ఈమె పేరు వినిపిస్తుంది.. అంతేకాదు ఆమెకు కర్ణాటక సీఐడీ నుంచి నోటీసులు కూడా అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ బ్యూటీతో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.. ఎవరెవరికి నోటీసులు అందాయో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

సన్నీ లియోన్ కు బిగ్ షాక్..

కర్ణాటక బెళగావికి చెందిన ‘శివం అసోసియేట్స్’ భారీ కుంబకోణం గురించి ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. దాదాపు రూ. 2,400 కోట్ల భారీ పోంజీ కుంబకోణం జరిగింది. ఇందులో తాజాగా బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. తాజాగా ఈమెకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.. శివం అసోసియేట్స్ అధినేత శివానంద, ప్రజల సొమ్ముతో 2023లో ‘ఛాంపియన్’ అనే సినిమా తీశాడు. అందులో ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేసింది. దీనికి గాను ఈమె భారీ పారితోషికం తీసుకుందని అధికారులు గుర్తించారు. దానికి వివరణ ఇవ్వాలని అధికారులు ఆమెకు నోటీసులు పంపారు. త్వరలోనే వివరణ ఇవ్వాలని, లేదంటే మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.మరి దీనిపై ఈ హాట్ బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి..

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: పుట్టింటికి వెళ్లిన ప్రేమ.. భద్రకు స్ట్రాంగ్ వార్నింగ్.. నర్మదా ప్లాన్ తో శ్రీవల్లికి షాక్..

కన్నడ స్టార్స్ కు తప్పని సెగ..

ఎంతోమందిని మోసం చేసిన శివం అసోసియేషన్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది.. ఇప్పటికే ఈ కేసులో పరోక్షంగా ఇన్వాల్వ్ అయినా పలువురిని అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కర్ణాటకలోని స్టార్స్ కు కూడా ఈ కేసులో భాగం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది.. బాలీవుడ్ బ్యూటీ సన్నిలియోన్ తో పాటుగా మరి కొంతమంది కన్నడ నటీనటులకు ఈ స్కామ్ సెగ తగులుతుంది. కన్నడ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న నటులు ‘డాలి’ ధనుంజయ, వశిష్ఠ సింహలతో పాటు క్రేజీ హీరోయిన్లు సప్తమీ గౌడ, రాగిణి ద్వివేదిలతో పాటుగా పలువురు సెలబ్రిటీలకు సీఐడీ అధికారులు నోటీసులు పంపినట్లు తెలుస్తుంది.. బాధితుల సొమ్ము నుంచే వీరికి భారీ ఎత్తున పారితోషికాలు ముట్టాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. వాళ్లకి కూడా వెంటనే వివరణ ఇవ్వాలని అధికారుల కోరినట్లు తెలుస్తుంది. మరి ఈ కుంభకోణం కేసులో ఇంకెంత మంది సెలబ్రిటీలు ఇరుక్కున్నారు అన్నది తెలియాల్సి ఉంది…

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×