E-Paper
Advertisement

టార్క్ vs పవర్.. బైక్ కొనే ముందు కచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాల్సిందే!

టార్క్ vs పవర్..  బైక్ కొనే ముందు కచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాల్సిందే!
Advertisement

Torque vs Power in Bikes: బైక్‌ల గురించి తెలుసుకునే సమయంలో కామన్ వినిపించే పదాలు టార్క్, పవర్. నిజానికి వీటి గురించి చాలా మందికి పెద్దగా అవగాహన ఉండదు. బైక్ ల గురించి బాగా తెలిసిన వాళ్లకు మాత్రమే అవగాహన ఉంటుంది. నిజానికి ఈ రెండు పదాలు అంత కష్టం కాదు. బైక్ నడిపేటప్పుడు అది ఎలా స్పందిస్తుందో, ఎంత వేగంగా వెళ్తుందో, రోడ్డు మీద ఎలా ఫీల్ ఇస్తుందో..ఈ రెండు విషయాలే నిర్ణయిస్తాయి. వీటి గురించి కొద్దిగా అర్థం చేసుకుంటే సరైన బైక్ ను సెలెక్ట్ చేసుకోవడంలో ఈజీ అవుతుంది.

ఇంతకీ టార్క్ అంటే ఏంటి?

ముందుగా టార్క్ గురించి తెలుసకుందాం..  టార్క్ అంటే బైక్‌ను ముందుకు నెట్టే శక్తి. థ్రాటిల్ తిప్పిన వెంటనే బైక్ ఒక్కసారిగా ముందుకు లాగినట్టు అనిపిస్తే, అది టార్క్ పని. ఇది తక్కువ వేగంలో చాలా ఉపయోగపడుతుంది.  ట్రాఫిక్‌ లో నిలిచిపోయినప్పుడు మళ్లీ స్టార్ట్ అవ్వడం, కొండలపైకి ఎక్కడం, వెనుక ఒకరిని కూర్చోబెట్టుకుని ప్రయాణించడం లాంటి వాటికి టార్క్ వల్ల సులభం అవుతుంది. అందుకే ఎక్కువ టార్క్ ఉన్న బైక్‌లు సిటీలో ఈజీగా నడుస్తాయి. రైడర్‌ కు అలసట కూడా తక్కువగా ఉంటుంది.

ఇంతకీ పవర్ అంటే ఏంటి?

Advertisement

పవర్ అనేది ఇంజిన్ ఎంత వేగంగా పని చేస్తుందో చెప్పే అంశం. సాధారణంగా దీన్ని హార్స్‌ పవర్ లో కొలుస్తారు. పవర్ ఉన్న బైక్‌లు ఎక్కువ స్పీడ్‌ ను అందుకోవడంలో,  ఆ స్పీడ్‌ను కొనసాగించడంలో ఉపయోగపడుతాయి. హైవే మీద వేగంగా వెళ్లాలంటే, ఓవర్‌ టేక్ చేయాలంటే, ఎక్కువ టాప్ స్పీడ్ కావాలంటే పవర్ కీలకం. అందుకే స్పోర్ట్స్ బైక్‌లు ఎక్కువగా పవర్‌ మీద ఫోకస్ పెడుతాయి.

ఇంకా సింపుల్ గా తెలుసుకోవాలంటే.. టార్క్ అనేది స్టార్ట్‌ లో ఇచ్చే పుష్, పవర్ అనేది ఆ తర్వాత ఇచ్చే స్పీడ్. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు బైక్‌ను వేగంగా కదిలించేది టార్క్. ఇప్పటికే వేగంగా వెళ్తున్నప్పుడు, ఆ వేగాన్ని పెంచి కొనసాగించేది పవర్.

పవర్, టార్క్ లో ఏది ముఖ్యం?

Advertisement

ఈ రెండింటిలో ఏది ముఖ్యం అనేది పూర్తిగా రైడర్ అవసరం మీద ఆధారపడి ఉంటుంది. రోజూ సిటీలోనే ఎక్కువగా డ్రైవ్ చేస్తే, ట్రాఫిక్‌ లో ప్రయాణిస్తే,  ఫ్యామిలీతో ఎక్కువగా తిరిగితే, టార్క్ ఉన్న బైక్ బాగా సరిపోతుంది. సౌకర్యంగా, ఈజీగా ఉంటుంది. కానీ, హైవే ప్రయాణాలు ఇష్టపడితే, ఎక్కువ స్పీడ్‌ లో వెళ్లాలనుకుంటే, పవర్ ఉన్న బైక్ తీసుకోవాలి.

కొత్తగా బైక్ కొనేవాళ్లు చాలా సార్లు మైలేజ్, లుక్ మాత్రమే చూసి నిర్ణయం తీసుకుంటారు. కానీ, అసలు రైడింగ్ ఫీల్ ఈ టార్క్, పవర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ టార్క్ ఉంటే బైక్ కంట్రోల్ చేయడం సులభం, ఎక్కువ పవర్ ఉంటే రైడ్ మరింత ఎగ్జైటింగ్‌ గా ఉంటుంది. టార్క్, పవర్ రెండూ ఒకదానికొకటి కలిసి పనిచేస్తాయి. మంచి బైక్ అంటే ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఉండాలి.

Read Also: ఓలా రీ ఎంట్రీ, టీవీఎస్ డామినేషన్.. అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ 5 బ్రాండ్స్ ఇవే!

Related News

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×