E-Paper
Advertisement

కియా డబుల్ సర్ప్రైజ్.. సైరోస్ EV, నెక్స్ట్ జనరేషన్ సోనెట్ లాంచింగ్ ఎప్పుడంటే?

కియా డబుల్ సర్ప్రైజ్.. సైరోస్ EV,  నెక్స్ట్ జనరేషన్ సోనెట్ లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

Kia Syros EV India Launch Confirmed: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కియా ఇండియా కీలక ముందడుగు వేస్తోంది. కొత్త మోడల్స్ ను పరిచయం చేబోతోంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కియా సైరోస్ ఈవీ జూలైలో అధికారికంగా లాంచ్ కానుందని సంస్థ ప్రకటించింది. 2026 ఇన్వెస్టర్ ప్రజెంటేషన్‌ లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది దేశంలో లోకల్‌గా తయారయ్యే కియా రెండో ఎలక్ట్రిక్ వాహనం కానుంది. దీంతో కంపెనీ ఈవీ లైనప్ మరింత బలపడనుంది.

కియా సైరోస్ ఈవీ గురించి..

డిజైన్ పరంగా చూస్తే, సైరోస్ ఈవీ పెద్దగా మార్పులు లేకుండా, ఇప్పటికే ఉన్న పెట్రోల్, డీజిల్ మోడల్‌ లాగే కనిపించే అవకాశం ఉంది. గ్రిల్, వీల్స్ వంటి చిన్న మార్పులు మాత్రమే ఉండవచ్చు. ఇంటీరియర్ స్పేస్, ఫీచర్ల విషయంలో కూడా ఈ మోడల్ మంచి స్టాండర్డ్‌ను కొనసాగిస్తుందని తెలుస్తోంది. ఇందులో సుమారు 42kWh బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. 133bhp పవర్, 255Nm టార్క్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగించనుంద.

మార్కెట్ లో మరింత పెరిగనున్న పోటీ

Advertisement

ఈ మోడల్ మార్కెట్లోకి రావడంతో సబ్-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో పోటీ మరింత పెరగనుంది. ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV 3XO ఈవీ లాంటి మోడల్స్ ఉన్న నేపథ్యంలో, కియా కూడా తన స్థానం బలపర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ విభాగం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరింత విస్తరిస్తుంది.

2027లో కియా సోనెట్ నెక్ట్స్ జనరేషన్ కారు లాంచ్  

అటు కియా పాపులర్ కాంపాక్ట్ SUV అయిన Kia Sonet కొత్త జనరేషన్‌పై కూడా పని చేస్తోంది. 2027లో విడుదల కానున్న ఈ మోడల్ డిజైన్, ఫీచర్ల పరంగా పెద్ద మార్పులతో రానుంది. కొత్త సోనెట్, ప్రస్తుతం ఉన్న K2 ప్లాట్‌ ఫామ్‌ను వదిలి. కొత్త K1 ప్లాట్‌ ఫామ్‌పై నిర్మించబడనుంది. ఈ ప్లాట్‌ ఫామ్ లేటెస్ట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ లకు సపోర్ట్ ఇస్తూ, ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్,  రిమోట్ డయాగ్నోస్టిక్స్ లాంటి ఫీచర్లను అందిస్తుంది. ప్రస్తుత సోనెట్‌ లో వెనుక సీటు స్థలం కొద్దిగా ఇరుకుగా ఉంది. కొత్త మోడల్‌లో ఈ సమస్యను పరిష్కరించనున్నారు. పవర్‌ ట్రెయిన్ పరంగా చూస్తే, ప్రస్తుత 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు కొనసాగవచ్చు. రానున్న రోజుల్లో హైబ్రిడ్ వేరియంట్ కూడా వచ్చే అవకాశముంది. అయితే, ఈ వేరియంట్ 2028 లేదంటే 2029 తర్వాతే మార్కెట్లోకి రావచ్చు.

Advertisement

ఫీచర్ల విషయానికి వస్తే, పెద్ద 12.3 అంగుళాల స్క్రీన్‌ లు, మెరుగైన ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, లెవెల్ 2 ADAS లాంటి  ఆధునిక సేఫ్టీ టెక్నాలజీలు అందుబాటులోకి రావచ్చు. భద్రత విషయంలో కూడా K1 ప్లాట్‌ ఫామ్ వల్ల మరింత బలం పెరగనుంది. కొత్త టెక్నాలజీ, ఆధునిక ఫీచర్లు, ఎలక్ట్రిక్ వేరియంట్లతో కియా భారత మార్కెట్లో తన పోటీని మరింతగా కొనసాగించనుంది.

Read Also: ఒకే రోజులో 108 ఇ-విటారాలు డెలివరీ.. హైదరాబాద్‌లో మారుతి కొత్త రికార్డు!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×