E-Paper
Advertisement

Feel good Movie OTT : మనవరాలికి లోకం చూపించే బామ్మ… ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఫిల్మ్

Feel good Movie OTT : మనవరాలికి లోకం చూపించే బామ్మ… ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఫిల్మ్
Advertisement

Feel good Movie OTT : చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే మూవీ ఒకటి రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. వేసవి సెలవుల్లో పల్లెటూరిలో గడిపే క్షణాలను గుర్తుకు తెప్పిస్తుంది ఈ సినిమా. ఒక చిన్నారి, ఆమె నాయనమ్మతో ఒక చిన్న ద్వీపంలో గడిపిన వేసవి రోజుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రకృతి అందాలతో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ జరిపారు. పిల్లలు పెద్దవాళ్లను అడిగే ప్రశ్నలు.. దేవుడు ఎక్కడుంటాడు? చీమలు స్వర్గానికి వెళ్తాయా? వంటివి ఫీల్ గుడ్ మెమొరీస్ ని ఇస్తుంది ఈ సినిమా. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘ది సమ్మర్ బుక్’ (The Summer Book). 2024లో వచ్చిన ఈ సినిమా టోవ్ జాన్సన్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా చార్లీ మెక్‌డోవెల్ తెరకెక్కించారు. ఇందులో 8 సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన గ్లెన్ క్లోజ్ నాయనమ్మ పాత్ర పోషించగా, సోఫియా పాత్రలో ఎమిలీ మాథ్యూస్ నటించారు. 2024లో ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడిన ఈ సినిమా, 2026 ఫిబ్రవరి 26 నుండి Amazon Prime Videoలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇది రచయిత్రి టోవ్ జాన్సన్ నిజ జీవితంలో తన తల్లి, మేనకోడలితో గడిపిన జ్ఞాపకాల ఆధారంగా ఈ కథను రాశారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఫిన్లాండ్‌లోని ఒక చిన్న ద్వీపంలో సోఫియా అనే ఆరేళ్ల పాప, వాళ్ళ నాయనమ్మతో వేసవి సెలవులను గడపడానికి వెళ్తుంది. సోఫియా తన తల్లిని కోల్పోయిన బాధలో ఉంటుంది. ఆమె తండ్రి ఎప్పుడూ తన పనిలో మునిగిపోయి ఉంటాడు. ఇలాంటి సమయంలో, సోఫియాకు తన వయసు మళ్ళిన నాయనమ్మే ప్రాణ స్నేహితురాలు అవుతుంది. వీళ్ళిద్దరూ ఆ ద్వీపంలోని రాళ్ళు, రప్పలు, సముద్ర తీరం వెంట తిరుగుతూ, ఆ అడవిలో దొరికే పువ్వులు, పక్షుల గురించి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తారు. వీరిద్దరి మధ్య ఉండే బంధం చాలా వింతగా, సరదాగా ఉంటుంది. నాయనమ్మకు తన వయసు వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నా, సోఫియా కోసం ఏదో ఒక కొత్త ఆటనో లేదా కథనో చెబుతూ ఆమెను సంతోషపెడుతుంది. లోకం గురించి, చావు పుట్టుకల గురించి, దేవుడి గురించి ఆ చిన్నారి అడిగే విడ్డూరమైన ప్రశ్నలకు నాయనమ్మ తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంది. ఒకవైపు ప్రకృతిలోని అందాలను చూపిస్తూనే, జీవితంలో ఎదురయ్యే బాధలను ఎలా తట్టుకోవాలో ఆ నాయనమ్మ సోఫియాకు నేర్పిస్తుంది.

Read Also :  ఈత కొడుతూ సీదా మొసలి నోట్లోకి… ఈ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×