Telangana: రాష్ట్రంలో కాస్తున్న ఎండలు గూబ గియ్, మాడు పగిలేలా మండిపోతున్నాయి. గత వారం రోజులుగా రోజుకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ కాకుండా భానుడు చిర్రుమంటున్నాడు. ఈ భానుడి భగభగలకు ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. సూర్యుడి ఎండ తీవ్రత ఎంత ఉందంటే బయటకు రోడ్డుపై గుడ్డు పగల గొట్టి ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఏం చక్కా మనకు గ్యాస్ కష్టాలు అనేవి తప్పుతాయా అన్నట్లు ఉంది సూర్యుడి ప్రభావం. మహానగరం హైదరాబాద్‌లో మధ్యాహ్న సమయాల్లో రోడ్లపై వాహనాలు రాకపోకలు తక్కువగా ఉంటున్నాయంటే పరిస్థితి మీరే అర్థం చేసుకోండి.
తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు
సూర్యుడి సెగలు ఒక్క హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాలేదు. యావత్ తెలంగాణ మొత్తం ఇదే స్థాయిలో వేడి తీవ్రత ఉంది. జనాలు ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే ఎండ వేడికి మాడిపోతారా అన్నట్లు ఉంది. అందుకే వాతావరణ కేంద్రం ఉదయం 11 గంటలు దాటిన తర్వాత ఎవరూ బయటకు రావ్వొద్దని సూచనలు చేస్తుంది. అయితే తాజాగా భారతీయ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. అదే వచ్చే నాలుగు రోజులు అంటే ఇవాళ్టి నుంచి ఈనెల 19 వరకు తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఈ నాలుగు రోజులు ఎండ తీవ్రత దారుణంగా ఉండనుంది. ఇంటి నుంచి బయటకు వస్తే ఆ ఎండ తాకిడికి వడదెబ్బ తగిలి ప్రాణాలు కూడా పోయే ఆస్కారం ఉందని చెప్పింది. ఈ వేడి గాలులు అనేవి యావత్ తెలంగాణ అంతటా ఒకేలా ఉంటాయి.
పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక హెచ్చరిక
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది. ఈ వేడి గాలులు అనేవి తెలంగాణ అంతటా దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటాయి. అంటే వేసవి కాలం వచ్చి 15 రోజుల్లోనే ఉష్ణోగ్రతలు పీక్ స్థాయికి వెళుతున్నాయి. తెలంగాణ ఉత్తరం, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అలాగే హైదరాబాద్ ప్రాంతంలోనే 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అంతే రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలే నమోదు అవ్వనున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి ఉష్ణోగ్రతలు కేవలం ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలో మాత్రమే నమోదు అయ్యేవి. కానీ ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఏప్రిల్ రెండో వారం నుంచి ఎండలు మండుతున్నాయి.
హీట్‌వేవ్‌లో సేఫ్టీ టిప్స్
అయితే ఎండల వేడి నుంచి కాపాడుకోవడానికి వాతావరణ శాఖ కీలక టిప్స్ చెప్పింది. ఏదైనా అత్యవసర పని ఉంటేనే ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలని తెలిపింది. అలాగే పనుల మీద బయటకు వెళ్లేవారు మాత్రం వారి వెంట గొడుగు, నీళ్ల బాటిల్ పట్టుకుని వెళ్లాలి. సన్‌స్క్రీన్ వంటివి బ్యాగులో క్యారీ చేయాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు వాటర్, కొబ్బరి నీటిని తాగాలి. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుని వెళ్లాలి. ఎక్కడికి వెళ్లిన వాటర్ బాటిల్ మాత్రం తప్పనిసరి. ఈ నాలుగు రోజులు ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటంతో ఈ నియమాలు పాటించాలి. లేదంటే అదే ఆఖరి చూపు అవుతుంది. అందుకే ఎండల్లో అనవసరంగా బయటకు వెళ్లొద్దు.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
Also Read: గుడ్డు కూర గొడవ.. చున్నీతో వ్యక్తి ప్రాణం తీసిన మహిళ