E-Paper
Advertisement

Best CNG Cars March 2026: టాటా To మారుతి.. మార్చి 2026 బెస్ట్ CNG కార్లు ఇవే!

Best CNG Cars March 2026:  టాటా To మారుతి.. మార్చి 2026 బెస్ట్ CNG కార్లు ఇవే!
Advertisement

Best 5 CNG Cars March 2026: భారతీయ మార్కెట్ లో కార్ల కొనుగోలు గత ఏడాదితో పోల్చితే భారీగా పెరిగాయి. ఎలక్ట్రిక్, పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు CNG కార్లకు మంచి డిమాండ్ కొనసాగుతోంది. మార్చి 2026 ట్రెండ్స్ ఆధారంగా ఇండియాలో బెస్ట్ CNG కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అధిక మైలేజ్ కలిగిన CNG కార్లలో మారుతి సుజుకి బాలెనో ఉంది. SUV కొనుగోలుదారుల కోసం టాటా పంచ్,  హ్యుందాయ్ ఎక్స్‌ టర్, మారుతి బ్రెజ్జా లాంటి ఫీచర్ రిచ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.  మారుతి సుజుకి ఎర్టిగా కూడా మంచి ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ, ​​మెరుగైన బూట్ స్పేస్, తక్కువ మెయింటెనెన్స్ ను కలిగి ఉంది.

మార్చి 2026లో టాప్ CNG కార్లు   

⦿ మారుతి సుజుకి బాలెనో: ఈ కారు మంచి మైలేజ్ ఇస్తుంది. సుమారు 30 కి.మీకి పైగా ప్రయాణిస్తుంది. ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.

Advertisement

⦿  టాటా పంచ్: ఈ కారు ట్విన్ సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్. చక్కటి బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది.

⦿ మారుతి సుజుకి బ్రెజ్జా: ఈ కాంపాక్ట్ SUVకి టాప్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. 1.5-లీటర్ ఇంజిన్, CNGని అందిస్తుంది.  . దీని ధర సుమారు రూ. 9.17 లక్షలు.

Advertisement

⦿ హ్యుందాయ్ ఎక్స్‌ టర్: స్టైలిష్ డిజైన్, మంచి పనితీరు కలిగిన ఫీచర్లతో నిండిన కాంపాక్ట్ SUVగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది 27 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది.

⦿ మారుతి సుజుకి ఎర్టిగా: 7 సీట్ల ఫ్యామిలీ కార్లలో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. బూట్ స్పేస్, మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Read Also: ఈవీ కారు బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలంటే, సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

మార్చి 2026 కీ ట్రెండ్స్   

⦿ సేఫ్టీ, స్పేస్: టాటా ట్విన్ సిలిండర్ టెక్నాలజీ CNG కార్లలో బూట్ స్పేస్ కోసం మంచి ఆప్షన్ గా మారింది.

⦿ SUVకి పెరిగిన ఆదరణ: బ్రెజ్జా, ఎక్స్‌ టర్ లాంటి మరిన్ని SUV మోడళ్లు టాప్ మోడల్స్ గా సత్తా చాటుతున్నాయి.

⦿ మంచి సామర్థ్యం:  చాలా  CNG మోడల్స్..  ముఖ్యంగా మారుతి మంచి మైలేజ్ ను అందిస్తున్నాయి. మారుతి సుజుకి ఆల్టో K10, స్విఫ్ట్‌ లలో 30 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని అందిస్తున్నాయి.

⦿ ధర: CNG టాప్ మోడల్స్ చిన్న కార్లకు దాదాపు రూ. 6 లక్షల నుంచి ప్రారంభం అవుతున్నాయి. అటు SUVలు,  MPVల ధరలు సుమారు రూ. 13-15 లక్షల వరకు ఉంటాయి.

Read Also: మీ కారు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలా.. ఇలా చేయండి భయ్యా.. వద్దన్నా వెళ్తుంది!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×