Monalisa Bhosle: మహాకుంభ్ మేళా సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న విషయం బయటకు రావడంతో ఈ ఘటనపై పెద్ద వివాదం మొదలైంది. ముఖ్యంగా మోనాలిసా వయస్సుపై వచ్చిన సమాచారం ఈ వ్యవహారానికి కొత్త మలుపు తీసుకొచ్చింది.
మోనాలిసా తల్లి చేసిన వ్యాఖ్యల ప్రకారం.. ఆమె కుమార్తె వయస్సు ఇంకా 18 సంవత్సరాలు పూర్తికాలేదని తెలుస్తోంది. ఆమె మాటల్లో చెప్పాలంటే..మోనాలిసాకు కేవలం 16 సంవత్సరాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కొన్ని సంస్థల నాయకులతో మాట్లాడిన సమయంలో ఆమె వెల్లడించిందని సమాచారం. ఆమె తల్లి ప్రకారం..ఈ పెళ్లికి తాను అనుమతి ఇవ్వలేదని కూడా చెప్పింది.
ఈ అంశంపై విశ్వహిందూ పరిషత్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. మోనాలిసా మైనర్ అయితే ఈ వివాహం చట్టపరంగా సరైనది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల బాల్య వివాహ నిషేధ చట్టం.. పోక్సో చట్టం ప్రకారం విచారణ జరపాలని వారు కోరుతున్నారు. పెళ్లి నిర్వహించినవారిపై, అలాగే కార్యక్రమానికి హాజరైన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మోనాలిసా తల్లి భావోద్వేగంగా మాట్లాడింది. తన కుమార్తెను బలవంతంగా తమ నుండి దూరం చేశారని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం మోనాలిసా వద్దే పుట్టిన తేదీకి సంబంధించిన పత్రాలు ఉన్నాయని కూడా ఆమె చెప్పింది. తన కూతురిని తిరిగి తీసుకురావడానికి సహాయం చేయాలని ఆమె అధికారులను కోరింది.
ఈ వివాహం కేరళలోని తిరువనంతపురం సమీపంలోని ఒక ఆలయంలో జరిగినట్లు సమాచారం. ఆ వేడుకకు కొంతమంది రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారని వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ సంఘటన మరింత చర్చకు కారణమైంది.
ఇంకా మరోవైపు మోనాలిసా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. కుటుంబ సభ్యులు తమ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నారని, అయినప్పటికీ తాను తన ఇష్టానుసారం ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు మరియు సంబంధిత అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వివాహంపై నిజమైన పరిస్థితి ఏమిటన్నది విచారణ తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.