E-Paper
Advertisement

Seerath kapoor: నిర్మాతలకు సీరత్ మాస్ వార్నింగ్.. చర్యలు తప్పవంటూ హెచ్చరిక!

Seerath kapoor: నిర్మాతలకు సీరత్ మాస్ వార్నింగ్.. చర్యలు తప్పవంటూ హెచ్చరిక!
Advertisement

Seerath kapoor: ప్రముఖ హీరోయిన్ సీరత్ కపూర్ (Seerath kapoor) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2014లో సుజిత్ – శర్వానంద్ కాంబినేషన్లో వచ్చిన ‘రన్ రాజా రన్’ సినిమా ద్వారా కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఈమె.. ఆ తర్వాత 2015లో బి.మధు , ఎన్.వి ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ‘టైగర్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం వంటి సినిమాలలో నటించిన సీరత్ కపూర్.. మళ్లీ హీరోయిన్గా కనిపించలేదు. కానీ భామాకలాపం 2లో కనిపించిన ఈమె.. చివరిగా మనమే, ఉషా పరిణయం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో బిజీగా మారిన ఈమె.. తాజాగా నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ.. హెచ్చరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిర్మాతలకు సీరత్ కపూర్ మాస్ వార్నింగ్..

అసలే అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న ఈమె నటించిన ఒక సినిమా షూటింగ్ పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంకా తనకు రావాల్సిన పారితోషకం ఇవ్వలేదు అంటూ ఆ చిత్ర నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ పోస్టులో సీరత్ కపూర్ తన ఆవేదనను పంచుకుంది కానీ అంతలోనే దానిని డిలీట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది.. ఇకపోతే అప్పటికే సీరత్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇందులో ” సినిమా షూటింగ్ పూర్తయి నాలుగు నెలలు కావస్తోంది. ఇప్పటికీ ప్రొడక్షన్ టీం నా రెమ్యూనరేషన్ సెటిల్ చేయలేదు. నా కుటుంబంలో అత్యవసర వైద్య పరిస్థితి ఉంది. డబ్బులు అవసరమని మొరపెట్టుకున్నా సరే కనీసం స్పందించలేదు.

Advertisement

చట్టపరంగా చర్యలు తప్పవంటూ..

ఇంతకాలం చాలా సహనంతో ఎదురు చూశాను. ఇప్పుడు నా ఓపిక పూర్తిగా నశించిపోయింది. నా టీంకి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయ్యింది. కష్టపడి పనిచేసిన వారికి ఫలితం దక్కకపోవడం చాలా బాధాకరం. ఈ సమస్యపై ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి పరిష్కరించాలి. ఇకపోతే నేను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అంటూ సదరు నిర్మాణ సంస్థకు హెచ్చరికలు జారీ చేసింది సీరత్ కపూర్. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా సీరత్ నిర్మాణ సంస్థకు వార్నింగ్ ఇస్తూ చేసిన కామెంట్లపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు సీరత్ నటించిన చిత్రం ఏమిటి? ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? అనే కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ALSO READ:Toxic Movie: టాక్సిక్ వాయిదా యుద్ధం వల్ల కాదా..తెరపైకి అసలు నిజం!

సీరత్ కి మద్దతుగా..

మరికొంతమంది తెరపై కనిపించే మెరుపుల వెనుక ఇలాంటి చేదు నిజాలు ఎన్నో ఉంటాయి. పెద్ద హీరోల చిత్రాలకైతే అంతా సవ్యంగా జరుగుతుంది. కానీ మీడియం లేదా చిన్న సినిమాల హీరోయిన్లకు పేమెంట్ విషయంలో ఇబ్బందులు పెడుతున్నారు. నిర్మాతలు కనీసం ఇప్పటికైనా ఈ విషయంపై స్పందించి ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులను సెటిల్ చేయడం మంచిది అంటూ కోరుతున్నారు. ఏదేమైనా సీరత్ తనకు జరిగిన నష్టాన్ని ఇంకొకరికి జరగకుండా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడం చూసి ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

Big Stories

Advertisement
×