Best Mileage Bikes In India 2026: ఫ్యూయెల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ లో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్‌లకు డిమాండ్ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగాలు, కాలేజీలు, చిన్న వ్యాపారాల కోసం ప్రయాణించే వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లే బైక్‌లు బెస్ట్ ఆప్షన్ గా మారుతున్నాయి. ప్రస్తుతం మైలేజీకి ప్రాధాన్యం ఇచ్చే కమ్యూటర్ బైక్ లు మార్కెట్ లో సత్తా చాటుతున్నాయి. పెట్రోల్ బైక్ లతో పాటు ఇప్పుడు CNG బైక్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్‌గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్యాక్టరీ ఫిట్ డ్ CNG మోటార్ సైకిల్‌గా గుర్తింపు పొందింది. ఈ బైక్ CNG మోడ్‌లో 102 కి.మీ/కేజీ వరకు మైలేజీ ఇస్తుంది. ఇందులో 125cc ఇంజన్ ఉండగా, పెట్రోల్, CNG రెండింటితో కూడా నడుస్తుంది. మొత్తం కలిపి దాదాపు 330 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.
మైలేజీ విషయంలో ఈ బైక్ కూడా సత్తా చాటుతోంది. లీటర్ పెట్రోల్ కు 80 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. 109.7cc ఇంజన్ తో వచ్చే ఈ మోడల్ తక్కువ బరువు, సింపుల్ డిజైన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.
ఈ బైక్ సుమారు 75 kmpl వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. సౌకర్యవంతమైన సీటింగ్, సాఫ్ట్ సస్పెన్షన్ కారణంగా సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి హీరో స్ల్పెండర్ ప్లస్ ఇప్పటికీ మైలేజీ విషయంలో టాప్ లో కొనసాగుతోంది. ఇది సుమారు 70 kmpl వరకు మైలేజీ ఇస్తుంది. అదే సమయంలో ఆధునిక ఫీచర్లతో పాటు మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తోంది. ఇందులో హీరో i3S టెక్నాలజీ ఉండటం వల్ల ఇంధన వినియోగం మరింత తగ్గుతుంది.
ఇక ఈ బైక్ కూడా 70 kmpl వరకు మైలేజీ ఇస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, సింపుల్ ఇంజన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
⦿ TVS Star City Plus
మంచి మైలేజీ ఇచ్చే బైక్‌లలో ఇది కూడా ఒకటి. LED లైటింగ్, సెమీ డిజిటల్ మీటర్ వంటి ఫీచర్లతో ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. ఈ బైక్ కూడా సుమారు 70 kmpl వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
Read Also: హీరో నుంచి 12 కొత్త మోడళ్లు.. పోటీ కంపెనీలకు ఇక ఇత్తడే!