E-Paper
Advertisement

పందెం కోడి చుట్టూ పరుగులు పెట్టే మూవీ… కడుపుబ్బా నవ్వించే కామెడీ మావా

పందెం కోడి చుట్టూ పరుగులు పెట్టే మూవీ… కడుపుబ్బా నవ్వించే కామెడీ మావా
Advertisement

Comedy Drama OTT : ఓటీటీలో ఏదైనా ఒక మంచి కామెడీ డ్రామాను చూసి కడుపుబ్బా నవ్వుకోవాలి అనుకుంటున్నారా ? అయితే ఈ మూవీ మీ కోసమే. కోడి మిస్ అవ్వడంతో పోలీసులు కోటి తిప్పలు పడాల్సి వస్తుంది. అది చూస్తే నవ్వాగదు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జీ5లో స్ట్రీమింగ్

లాయల్ రూరల్ క్రైమ్-కామెడీ వెబ్ సిరీస్ ‘మేము కాప్‌లం’ (Memu Copulam). 2026 మే 22న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో రిలీజ్ అయింది. మెగా బ్రదర్ నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల ఇందులో ప్రధాన పాత్రల్లో నటించగా, ఈ సిరీస్‌ కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. బి.వి.ఎస్. రవి నిర్మాతగా వ్యవహరించారు. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్న ఈ క్లీన్ విలేజ్ డ్రామా సిరీస్ ప్రస్తుతం ZEE5లో తెలుగులోనే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో కూడా స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. సాకేత్ కోమండూరి సంగీతం, గోదావరి జిల్లాల నేటివిటీ ఈ సిరీస్‌లో మెయిన్ హైలెట్స్. పెద్దగా రక్తపాతం, వినకూడని మాటలు వంటివి ఇందులో లేకపోవడం మరో ప్లస్ పాయింట్. ఈ క్రైమ్-కామెడీ మిస్టరీని వీకెండ్‌ లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూడవచ్చు.

కథలోకి వెళ్తే…

Advertisement

కోనసీమలోని ‘మహాదేవపట్నం’ అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది స్టోరీ. ఆ ఊరి పెద్ద మనిషి గజపతి రాజు (నాగబాబు). ఆయన మాటంటే తిరుగు ఉండదు ఆ ఊళ్ళో. ఆయన ‘సలార్ రాజు’ అనే విలువైన పందెం కోడిని పెంచుకుంటూ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. సంక్రాంతి కోడిపందాల ఛాంపియన్‌షిప్ కోసం ఈ ప్లాన్ అంతా. అయితే టోర్నమెంట్‌ కు కొన్ని రోజుల ముందే ఆ కోడి మాయం అవ్వడంతో కథలో ఊహించని మలుపు తిరుగుతుంది. దీన్ని గజపతి రాజు పరువు ప్రతిష్టల సమస్యగా భావిస్తాడు. అందుకే ఆ కోడిని వెతికే బాధ్యత ఊరి పోలీస్ స్టేషన్‌కి చేరుతుంది. రవి (రవితేజ నన్నిమాల), మోహన్ (గెటప్ శ్రీను) అనే ఇద్దరు అమాయకపు కానిస్టేబుళ్లకు ఆ కేసును ఇస్తారు.

Also Read : ఇదెక్కడి సినిమా గురూ… ప్రేమ పేరుతో భార్యను సాఫ్ట్‌వేర్‌లో బంధించే సైకో భర్త

Advertisement

రవి, మోహన్ ఇద్దరూ కలిసి ఆ కోడిని వెతకడానికి బయల్దేరతారు. ఊర్లో ఉన్న ప్రతీ ఒక్కరినీ అనుమానిస్తూ… వింత క్లూస్‌ ని ఫాలో అవుతూ ఇన్వెస్టిగేట్ చేస్తారు. మరోవైపు ఊర్లో వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఊర్లో వాళ్ళు అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. వాళ్ళను హాస్పిటల్ లో చేరుస్తారు. అంతేకాదు ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి. పందెం కోడి దొంగతనం కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటే, అదికాస్తా ఊళ్ళోని సీక్రెట్స్ బయట పడే దిశగా సాగుతుంది.

దీంతో ఆ కోడి అదృశ్యం సాధారణ దొంగతనం కాదని తెలుస్తుంది. ఆ ఊరే లేకుండా చేసే పెద్ద మెడికల్ స్కామ్ దాగి ఉందని కానిస్టేబుల్ తెలుసుకుంటారు. ఇంకోవైపు మీనాక్షి (రీతూ చౌదరి) అనే జర్నలిస్ట్ కూడా ఈ కేసును ఫాలో చేస్తుంది. ఇక్కడే ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి ? ఇంతకీ దొంగతనం ఎందుకు, ఎలా జరిగింది ? అన్నది స్టోరీ.

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×