E-Paper
Advertisement

Magical Car: సైగలతోనే డోర్లు ఓపెన్.. ఈ మ్యాజికల్ కారు భలే ఉంది గురూ!

Magical Car:  సైగలతోనే డోర్లు ఓపెన్.. ఈ మ్యాజికల్ కారు భలే ఉంది గురూ!
Advertisement

Car Doors Open Without Touch: ప్రపంచ వ్యాప్తంగా ఆటో మార్కెట్ రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. సరికొత్త టెక్నాలజీతో చిత్ర విచిత్రమైన కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక చైనీస్ పరిశోధకులు మరింత ముందుకెళ్లి క్రేజీ కార్లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగానే AITO M9, Li Auto, NIO లాంటి ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్లు కారును టచ్ చేయకుండానే డోర్లు ఓపెన్ అవుతున్నాయి. ఈ హ్యాండ్స్ ఫ్రీ  కార్లను కేవలం సంజ్ఞల ద్వారా కంట్రోల్ చేసే డోర్ ఓపెనింగ్ సిస్టమ్‌ లను పరిచయం చేస్తున్నాయి. అయితే, ఈ సాంకేతికత భద్రతాపరమైన ఆందోళనలను కలిగిస్తోంది. వినియోగదారులు ఈ ఆటోమేటెడ్ సిస్టమ్‌ పై ఆధారపడటానికి ఆలోచిస్తున్నారు.

ఇంతకీ ఏంటీ ఈ కార్ల ప్రత్యేకత?

⦿ గెస్చర్ బేస్డ్ టెక్నాలజీ: చైనాలో కార్లు ఎక్కువగా AI ఆధారిత, గెస్చర్ ఆధారిత, ఆటోమేటిక్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఇవి చేతిని ఊపడం ద్వారా అన్‌ లాక్ చేయడం, ఓడర్లు ఓపెన్ చేయడం, వాటంత అవే పార్క్ చేయడం జరుగుతుంది.

Advertisement

⦿ భద్రతాపరమైన ఆందోళనలు, నిబంధనలు: ప్రమాదాల సమయంలో తలుపులు ఓపెన్ కాకపోవడం లాంటి భద్రతాపరమైన ఆందోళనలు, యాక్సిడెంట్ సమయంలో లోపలే చిక్కుకుపోయే అవకాశం ఉందనే నివేదికల కారణంగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఈ డోర్లు ఉన్న కార్లను నిషేధించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

⦿ వినియోగదారులు ఏమంటున్నారు?: ఈ అధునాతన టెక్నాలజీని కొంతమంది స్వాగతిస్తుండగా, మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫీచర్ల చాలా ప్రమాదకరమైనవి అంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం, గెస్చర్ కంట్రోల్స్ ను అన్ని సమయాల్లో నమ్మదగినవిగా ఉండవని వెల్లడిస్తున్నాయి.

Advertisement

⦿ రాపిడ్ ఇన్నోవేషన్: పలు ఆధునిక చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలు ఈ ఫీచర్లను తీసుకొచ్చాయి. చైనాలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 100 మోడళ్లలో సుమారు 60 శాతం కార్లు ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.

Read Also: పుమా లాంటి బైక్.. దీన్ని తయారు చేసేందుకు ఏకంగా 30 నెలలు పట్టింది!

ఈ సాంకేతికత భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత సౌలభ్యం, విశ్వసనీయత, భద్రతకు మరింత భరోసా ఇవ్వబోతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని ప్రతికూలతలు ఉన్నా, వాటిని సరిచేసే అవకాశం ఉందంటున్నారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని సూచిస్తున్నారు. అంతేతప్ప, మళ్లీ వెనక్కి వెళ్లే ఆలోచన చేయకూడదంటున్నారు. ప్రతికూలతలను సరిచేస్తే, రాబోయే కార్లు మరింత ఫ్యూచరిస్టిక్ గా ఉంటాయని చెప్తున్నారు.

Read Also: ఇది బైక్ కాదు కారు.. లోపల ఎలా ఉందో చూస్తే మతిపోద్ది భయ్యా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×