E-Paper
Advertisement

Tilting Microcar: ఇది బైక్ కాదు కారు.. లోపల ఎలా ఉందో చూస్తే మతిపోద్ది భయ్యా!

Tilting Microcar: ఇది బైక్ కాదు కారు.. లోపల ఎలా ఉందో చూస్తే మతిపోద్ది భయ్యా!
Advertisement

AEMotion Tilting Microcar: ఆటో మోబైల్ రంగంలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు నెమ్మదిగా CNG కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ రంగం వైపు అడుగు పెడుతున్నాయి. పెట్రో కార్లను వదిలేసి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి ఆటో కంపెనీలు. ఇక ఫ్రెంచ్ స్టార్టప్ కంపెనీ  ఏఈ మోషన్ మరో అడుగు ముందుకు వేసింది.  పట్టణ ప్రయాణాల కోసం ఏకంగా బైక్ లాంటి కారును తయారు చేసింది. జస్ట్ 79 సెం.మీ వెడల్పుతో, నాలుగు చక్రాలతో కూడిన ఎలక్ట్రిక్ టిల్టింగ్ మైక్రోకార్‌ను ఆవిష్కరించింది. ఇది బైక్ లాంటి యాక్టివ్ నెస్ తో పాటు కారు లాంటి భద్రతను అందిస్తుంది. ఈ కారు 35° వరకు వంగే వ్యవస్థ ఉంది. ఒకే ఛార్జ్ తో ఏకంగా 200 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది. గంటకు 115 కి.మీ. గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. ఇద్దరు వ్యక్తులు పక్కపక్కనే కూర్చునేలా సీటింగ్ కూడా ఉంది.

AEMotion మైక్రోకార్ కీలక ఫీచర్లు

⦿ డిజైన్: ఈ కారు  79 సెం.మీ. వెడల్పుతో ఒక లగ్జరీ బైక్ మాదిరిగా కనిపిస్తుంది. టిల్టింగ్ సిస్టమ్‌ ను కలిగి ఉంది. ట్రాఫిక్‌ లో ఈజీగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

Advertisement

⦿ పనితీరు: ఈ వాహనం గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు ఒకే ఛార్జ్ తో 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది.

⦿ బ్యాటరీ, రేంజ్: ఇది రిమూవబుల్ బ్యాటరీలను కలిగి ఉంటుంది. ఒక్కో బ్యాటరీ సుమారుగా 70 కి.మీ పరిధిని అందిస్తుంది.

Advertisement

⦿ నిర్మాణం: ఈ మైక్రో కారు 4 చక్రాలను కలిగి ఉంటుంది.  నాలుగు పాయింట్ల సీట్ బెల్టులు. ఎండా, వర్షం నుంచి కాపాడుకునేందుకు పైనుంచి కప్పు ఉంటుంది. పైకి తెరుచుకునే ఎలిట్రల్ తలుపులు ఉన్నాయి.

⦿ కంట్రోల్: ఈ వాహనాన్ని హ్యాండిల్‌ బార్‌ తో నడుపుతారు. ఇది బైక్ ను నడిపినట్లు అనుభూతి కలుగుతుంది.

⦿ ఎక్కడ లభిస్తుంది. ఆటో ఎవల్యూషన్ ప్రకారం, ఈ కారుకు సంబంధించిన డెలివరీలు 2026 చివరి నాటికి ప్రారంభమవుతాయని అంచనా. అయితే, ఈ కారును లీజింగ్ పద్దతిలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. అంటే నెలకు కొంత మొత్తాన్ని చెల్లించేలా అవకాశం కల్పించనుంది.

Read Also: ఏథర్ 450 అపెక్స్ vs సుజుకి ఇ-యాక్సెస్, రెండింటిలో ఏది బెస్ట్?

ఈ కారు ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

ఈ మైక్రో కారు రద్దీగా ఉండే నగరాల కోసం రూపొందించబడింది. రెండు సీట్ల కాన్ఫిగరేషన్ తో వస్తుంది. చూడ్డానికి కారు మాదిరిగానే నాలుగు చక్రాలతో ఉన్నా, బైక్ నడుపుతున్నట్లు ఫీలింగ్ కలుగుతుంది. ట్రాఫిక్ ప్రయాణాలకు ఈ మైక్రో కారు అనుకూలంగా ఉంటుంది.

Read Also: రివోల్ట్ బంపర్ ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్స్ పై ఏకంగా రూ.25 వేలు తగ్గింపు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×