E-Paper
Advertisement

Toyota Urban Cruiser: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెక్ ప్యాకేజీ ప్రారంభం, ధర కాస్ట్ ఎంతో తెలుసా?

Toyota Urban Cruiser:  టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెక్ ప్యాకేజీ ప్రారంభం, ధర కాస్ట్ ఎంతో తెలుసా?
Advertisement

Toyota New Tech Package: వినియోగదారులకు టయోటా కంపెనీ ఎప్పటికప్పుడు చక్కటి సర్వీసులు అందిస్తుంది. అందులో భాగంగానే సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కోసం కొత్త టెక్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీ హైరైడర్  అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీలో భాగంగా, SUVతో అందించే సాంకేతికతను మెరుగుపరచడానికి కార్ల తయారీదారు మూడు టయోటా జెన్యూస్ యాక్సెసరీస్ ను ప్రవేశపెట్టింది.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్  టెక్ ప్యాకేజీ గురించి..

టెక్ ప్యాకేజీలో క్యాబిన్ కు సంబంధించిన యాంబియంట్ లైటింగ్, హెడ్స్ అప్ డిస్ప్లే, డిజిటల్ వీడియో రికార్డర్,  డాష్ కెమెరా ఉన్నాయి. యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ క్యాబిన్ లోపల సూక్ష్మమైన, కస్టమైజబుల్ గ్లోను అందిస్తుంది. హెడ్స్ అప్ డిస్ ప్లే ఉంటుంది. ఇది డ్రైవర్ పరధ్యానాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. ఆన్ రోడ్ భద్రతను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో, డిజిటల్ వీడియో రికార్డర్ డ్రైవింగ్ ఫుటేజ్‌ ను  అన్ స్టాఫబుల్ గా రికార్డ్ చేస్తుంది.

టెక్ ప్యాకేజీ ధర ఎంత అంటే?

Advertisement

టయోటా టెక్ ప్యాకేజీ ధరను రూ. 29,499గా నిర్ణయించింది. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్‌ షిప్‌ లలో అందుబాటులో ఉంటుంది. ఇది యాక్సెసరీ ప్యాక్‌గా అందించబడినందున, కస్టమర్లు కారు కొనుగోలు సమయంలో లేదంటే తరువాత ఏదైనా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వేరియంట్‌కు జోడించడానికి సెలెక్ట్ చేసుకోవచ్చు.

Read Also: రెనాల్ట్ డస్టర్ 2026 vs టాటా సియెర్రా. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

హైరైడర్ ధర ఎంత అంటే?

Advertisement

ప్రస్తుతం హైరైడర్ ధర రూ. 10.94 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఈ కారు దేశంలో 2,00,000 యూనిట్ అమ్మకాల మైలురాయిని దాటింది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, పనోరమిక్ సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఛార్జింగ్, USB ఛార్జింగ్ పోర్ట్‌ లు, 360 డిగ్రీ కెమెరాతో వస్తుంది.

Read Also: మహీంద్రా To మారుతి.. జనవరిలో అమ్మకాల్లో దుమ్మురేపిన కార్లు ఇవే!

వినియోగదారులకు మంచి సర్వీస్ సపోర్ట్

టయోటా కాంప్రహెన్సివ్ ఓనర్ షిప్ ప్లాన్ లో భాగంగా హైరైడర్‌కు సపోర్ట్ చేస్తుంది. కొనుగోలుదారులు 66 జెన్యూన్ యాక్సెసరీస్ ను చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. హైబ్రిడ్ బ్యాటరీపై ఎనిమిది సంవత్సరాలు లేదంటే 1,60,000 కిమీ వారంటీతో పాటు ప్రామాణిక మూడు సంవత్సరాలు లేదంటే 1,00,000 కిమీ వారంటీని పొందవచ్చు. ఐదు సంవత్సరాలు, 2,20,000 కిమీ వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.  వినియోగదారులకు మెరుగైన సర్వీసులు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాన్ ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. హైరైడర్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని సూచించింది.

Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన ఈవీలు, జనవరి 2026లో నెంబర్ వన్ ఈ స్కూటరే!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×