E-Paper
Advertisement

Land Cruiser FJ: క్లాసిక్ లుక్, మోడ్రన్ టెక్నాలజీ.. ల్యాండ్ క్రూయిజర్ FJ లెజెండరీ కాన్సెప్ట్ అదిరింది గురూ!

Land Cruiser FJ: క్లాసిక్ లుక్, మోడ్రన్ టెక్నాలజీ.. ల్యాండ్ క్రూయిజర్ FJ లెజెండరీ కాన్సెప్ట్ అదిరింది గురూ!
Advertisement

Toyota Land Cruiser FJ Legendary Concept: టయోటా కంపెనీ BIMS 2026 ఆటో ఎక్స్‌ పోలో క్రేజీ కాన్సెప్ట్ ను ఆవిష్కరించింది. ల్యాండ్ క్రూయిజర్ FJ లెజెండరీ కాన్సెప్ట్ రివీల్ చేసింది. ఈ వెహికల్ కారు లవర్స్ ను అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ కాన్సెప్ట్ వెహికల్  ఓల్డ్ డిజైన్‌, లేటెస్ట్ టెక్నాలజీతో కలిపి రూపొందింది. చూసే వారికి ఇది ఒక క్లాసిక్ SUV లుక్‌తో పాటు ఫ్యూచరిస్టిక్ ఫీల్‌ ను అందిస్తుంది.

ఆకట్టుకుంటున్న క్లాసిక్ లుక్

ల్యాండ్ క్రూయిజర్ FJ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, గట్టి బంపర్, స్క్వేర్ ఆకారంలో హెడ్‌ లైట్లు పవర్ ఫుల్ లుక్ అందిస్తున్నాయి. పాత ల్యాండ్ క్రూయిజర్ మోడల్స్‌ ను గుర్తు చేస్తూ, ఈ కొత్త కాన్సెప్ట్‌ లో మోడ్రన్ టచ్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆఫ్ రోడింగ్‌ కు అనుకూలంగా ఉండేలా దీనిని రూపొందించారు.

ఇంటీరియర్ గురించి..

Advertisement

ల్యాండ్ క్రూయిజర్ F ఇంటీరియర్ విషయానికి వస్తే.. సింపుల్‌ గా కనిపించినా చాలా అడ్వాన్స్‌ గా ఉంటుంది. డిజిటల్ డిస్‌ ప్లేలు, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి. ప్రయాణికులకు కంఫర్ట్‌ తో పాటు టెక్నాలజీ ఎక్స్ పీరియెన్స్ ను ఇచ్చేలా ఇంటీరియర్ డిజైన్ ఉండబోతోంది.

ఇంజిన్, పనితీరు గురించి..

ల్యాండ్ క్రూయిజర్ F ఇంజిన్, పనితీరు గురించి టయోటా పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇది హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్‌ లో వచ్చే అవకాశం ఉందని సమాచారం. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా, అలాగే శక్తివంతమైన పనితీరును అందించేలా ఈ వాహనాన్ని రూపొందిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ వెహికల్ ఆఫ్ రోడింగ్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. గట్టి రోడ్లు, పర్వత ప్రాంతాలు, అడవుల్లో ఈజీగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. బలమైన బాడీ, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ లాంటి లక్షణాలు ఈ వాహనంలో ఉండే అవకాశం ఉంది.

Advertisement

Read Also: 45 కి.మీ మైలేజ్ తో 7 సీటర్ ఫ్యామిలీ కారు.. జస్ట్ రూ. 5.9 లక్షలకే!

BIMS 2026లో ప్రత్యేక ఆకర్షణగా

BIMS 2026లో ఈ వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సందర్శకులు దీని డిజైన్, ఫీచర్లను చూసి ఆసక్తి వ్యక్తం చేశారు. ఇది ఇంకా కాన్సెప్ట్ మోడల్ మాత్రమే అయినప్పటికీ, భవిష్యత్తులో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028లోగా ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. ధర సుమారు రూ. 35 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  ల్యాండ్ క్రూయిజర్ FJ లెజెండరీ కాన్సెప్ట్ పాత క్లాసిక్ SUVల అందాన్ని, కొత్త టెక్నాలజీని కలిపిన మోడల్‌గా నిలిచింది. ఆఫ్ రోడింగ్ రైడర్స్ కు ఇది డ్రీమ్ వెహికల్ గా మారే అవకాశముంది.

Read Also: యమహా అద్భుతం.. ఈ బైక్ పడేసినా పడిపోదు!

Related News

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×