E-Paper
Advertisement

R Madhavan: ఆ సీన్‌లో సిగరెట్ స్మోకింగ్.. సారీ చెప్పిన ‘ధురంధర్’ నటుడు

R Madhavan: ఆ సీన్‌లో సిగరెట్ స్మోకింగ్.. సారీ చెప్పిన ‘ధురంధర్’ నటుడు
Advertisement

R Madhavan: ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియని విషయం కాదు. అదే సమయంలో రికార్డులతో పాటు కాంట్రవర్సీలు కూడా ఈ సినిమాను వెంటాడుతున్నాయి. తాజాగా ఈ చిత్రం చట్టపరమైన చిక్కుల్లో పడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సిక్కుల పవిత్ర సూక్తులు అయిన ‘గుర్బానీ’ని అవమానించేలా ఒక సీన్ ఉందంటూ సిక్కు సంఘం ఫిర్యాదు చేయడంతో.. చిత్ర బృందం, నటుడు ఆర్. మాధవన్ పై ముంబైలో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. సినిమాల్లో మతపరమైన భావాలను గౌరవించాలని, వివాదాస్పదంగా ఉన్న ఆ సీన్‌ను తొలగించాలని, అలాగే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో సిక్కు సంఘం నేతలు కోరారు. చిత్ర బృందం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నటుడు ఆర్. మాధవన్ (R Madhavan) ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ.. ఆ సీన్ గురించి వివరించడమే కాకుండా, క్షమాపణలు కూడా కోరారు.

అవమానించడమే..

అసలు వివాదం ఏమిటంటే.. ఈ వివాదం (Dhurandhar 2 Controversy) అంతా ఒక సీన్ చుట్టూ తిరుగుతోంది. అందులో మాధవన్ పోషించిన పాత్ర, సిగరెట్ తాగుతూ దశమ్ గ్రంథ్ సాహిబ్ లోని ‘శూరా సో పెచానియే, జో లడే దీన్ కే హేత్. పుర్జా పుర్జా కట్ మరే, కభూ నా చడ్డే ఖేత్’ అనే వాక్యాలు చెబుతుంది. ఇది సిక్కు సంప్రదాయాలకు విరుద్ధమని, అలాగే గురు గోవింద్ సింగ్‌ని అవమానించడమేనని సిక్కు సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సన్నివేశంపై ఆర్ మాధవన్ వివరణ ఇస్తూ.. ‘‘ధురంధర్ 2 చిత్ర బృందం తరపున మా సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మా సంతోషాన్ని ఎలా తెలియజేయాలో కూడా తెలియడం లేదు. అంత గొప్పగా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. అయితే, ఈ మధ్య మా దృష్టికి ఒక విషయం వచ్చింది.

Advertisement

Also Read- Mythri Movie Makers: మరో తమిళ చిత్రాన్ని ప్రకటించిన మైత్రీ బ్యానర్.. హీరో ఎవరంటే?

ఆదిత్య ధర్ ముందే చెప్పారు

ఈ సినిమాలో ఒక సీన్ ఉంది, అందులో నేను గురు గోవింద్ సింగ్ ‘దశమ్ గ్రంథ్’ లోని కొన్ని వాక్యాలు చెబుతాను. ఆ సమయంలో నేను సిగరెట్ తాగుతూ ఉండడం కొంతమందిని బాధించిందని తెలిసింది. కానీ, నేను మీకు ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను.. అది నిజం కాదు, చిన్న పొరపాటు జరిగింది. దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ సీన్ చిత్రీకరించే ముందే ఆయన నాతో చెప్పారు. ‘ఈ లైన్స్ చెప్పడానికి ముందే మీరు సిగరెట్ ఆపేయాలి. మీ నోటి నుండి పొగ రాకూడదు, స్క్రీన్ మీద ఎక్కడా పొగ కనిపించకూడదు, మీ చేతిలో కూడా సిగరెట్ ఉండకూడదు. ఎందుకంటే ఆ వాక్యాలు చాలా పవిత్రమైనవి’ అని చెప్పారు. నేను కూడా అలాగే చేశాను.

Advertisement

Also Read- Manasa Sharma: వెబ్ సిరీస్‌, సినిమా.. ఈ రెండింటికి తేడా ఏంటంటే.. – ‘రాకాస’ డైరెక్టర్

ముందే సిగరెట్ ఆపేశాను

మీరు ఆ సీన్ జాగ్రత్తగా గమనిస్తే.. నా నోటి నుండి పొగ రాదు, ప్రేమ్‌లో ఎక్కడా పొగ ఉండదు, సీన్ ముగిసే వరకు కూడా నా చేతిలో సిగరెట్ ఉండదు. మేము ఎవరి మనసు నొప్పించాలని ఈ సినిమా తీయలేదు. మేము ఎప్పుడూ సిక్కు కమ్యూనిటీకి అండగా ఉంటాము, వారిని ఎంతో గౌరవిస్తాము. నిజానికి నా ప్రతి సినిమా విడుదలకు ముందు నేను గోల్డెన్ టెంపుల్‌ను సందర్శిస్తుంటాను. కాబట్టి ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం మాకు లేదు, అలా చేయలేదు కూడా. నేను మళ్ళీ చెబుతున్నాను.. సీన్ మొదలైనప్పుడు నా చేతిలో సిగరెట్ ఉంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ స్మోక్ చేస్తుంది. కానీ డైలాగ్ మొదలవ్వడానికి ముందే నేను సిగరెట్ ఆపేశాను. సో.. ఆ సీన్ మొత్తం ఎక్కడా స్మోక్ కానీ, సిగరెట్ కానీ ఉండదు. ఒకవేళ తెలిసో తెలియకో ఎవరినైనా బాధపెట్టి ఉంటే.. క్షమించండి. మేమందరం మీతోనే ఉన్నాం. అందరూ సంతోషంగా ఉండండి. హ్యాపీ ధురంధర్2’’ అని వివరణ ఇచ్చారు.

">

Also Read- Deva katta: పవన్ కళ్యాణ్ తో పొలిటికల్ సినిమా.. స్పందించిన దేవా కట్టా.. స్క్రిప్ట్ పనులు మొదలు?

Related News

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

Big Stories

Advertisement
×