E-Paper
Advertisement

Toyota vs Maruti Suzuki: టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా vs మారుతి సుజుకి ఇ విటారా, వీటిలో ఏది బెస్ట్ అంటే?

Toyota vs Maruti Suzuki: టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా vs మారుతి సుజుకి ఇ విటారా, వీటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Toyota Urban Cruiser Ebella vs Maruti Suzuki e Vitara: టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, మారుతి సుజుకి ఇ-విటారా ఒకే ప్లాట్‌ ఫారమ్ మీద రూపొందాయి. మెకానికల్‌గా ఇంచుమించు ఈ రెండు ఎలక్ట్రిక్ SUVలు ఒకేలా ఉంటాయి. రీసెంట్ గా లాంచ్ కాగా, త్వరలో విడుదల కానున్నాయి. ఇ-విటారా అగ్రెసివ్ లుక్‌ను కలిగి ఉండగా, ఎబెల్లా చక్కటి  ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంది.  ఫీచర్లు దాదాపు సమానంగా ఉన్నాయి.

టయోటా ఎబెల్లా vs మారుతి సుజుకి ఇ-విటారా పోలికలు

⦿ డిజైన్: ఎబెల్లా డిజైన్ కొంచెం విభిన్నంగా ఉంటుంది.  ముఖ్యంగా హెడ్‌ లైట్ సెటప్‌ డిఫరెంట్ గా ఉంటుంది. ఇ-విటారాలో Y-ఆకారపు DRLలు ఉంటాయి. ఎబెల్లాలో స్లీకర్ DRLలు ఉంటాయి.

Advertisement

⦿ పవర్, బ్యాటరీ: రెండు కార్లు ఒకే విధమైన 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తాయి. ఇవి గరిష్టంగా 189 Nm టార్క్‌ను అందిస్తాయి. చిన్న బ్యాటరీతో 440 కిమీ, పెద్ద బ్యాటరీతో 543 కిమీ వరకు ప్రయాణించవచ్చు।

⦿ ఫీచర్లు: దాదాపు ఒకేలా ఉంటాయి. 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌ మెంట్, 10.25 అంగుళాల డిజిటల్ డిస్‌ ప్లే, పనోరమిక్ సన్‌ రూఫ్, 7 ఎయిర్‌ బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS రెండింటిలోనూ ఉన్నాయి.

Advertisement

⦿ ఆడియో: టయోటా ఎబెల్లాలో 10-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్ ఉండగా, ఇ-విటారాలో 10-స్పీకర్ ఇన్ఫినిటీ యూనిట్ ఉంటుంది.

⦿ పరిమాణం: రెండు కార్లు పరిమాణంలో దాదాపు సమానంగా ఉన్నాయి. పొడవు సుమారు 4275 mm, 4285 mm, వెడల్పు 1800 mm ఉంటుంది.

⦿ ధర: రెండు కంపెనీలు ఇంకా అధికారికంగా ధర వివరాలను వెల్లడించలేదు. కానీ, టయోటా ఎబెల్లాలో రూ.16 లక్షల నుంచి రూ. 19.50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇ-విటారా ప్రారంభ ధర రూ. 13.49 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

⦿ రెండు కార్ల మధ్య కీలక తేడాలు: ఎబెల్లా, ఇ-విటారా ప్లాట్‌ ఫారమ్, మెకానిక్‌లను పంచుకున్నప్పటికీ, వాటి డిజైన్,  బ్రాండింగ్‌లో తేడాలు ఉన్నాయి. ఎబెల్లా కొద్దిగా భిన్నమైన ఫ్రంట్ లుక్ తో ఉండగా, ఇ-విటారా అగ్రెసివ్ డిజైన్ ను కలిగి ఉంటాయి. మిగతా అంశాలు దాదాపు సమానంగా ఉంటాయి.

Read Also: రేంజ్ రోవర్ ను మక్కికి మక్కి దింపేసిన చైనా, మరీ ఇంత ఘోరమా?

ఎవరికి ఏ కారు అనుకూలంగా ఉంటుందంటే?

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, మారుతి సుజుకి ఇ-విటారా ఒకేలాంటి ఫీచర్లతో పాటు సామర్థ్యాలను కలిగి ఉన్నాయి.  కానీ, వాటి డిజైన్, ఆడియో సిస్టమ్‌లలో తేడాలు ఉన్నాయి. ప్రీమియం లుక్,JBL సౌండ్ కావాలని అనుకునే వాళ్లు  టయోటా ఎబెల్లాను తీసుకోవడం మంచిది. రగ్గడ్ డిజైన్ ను ఇష్టపడే వాళ్లు మారుతి ఇ విటారాను ఎంచుకోవడం బెస్ట్.

Read Also: టాటా పంచ్ EV, టాటా పంచ్ పెట్రోల్, వీటిలో ఏది కొంటే బెస్ట్?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×