E-Paper
Advertisement

T20 World Cup 2026 Super 8: శ్రీలంక‌లో కుండ‌పోత‌..గ్రూప్ 2 మ్యాచ్ లు అన్ని ర‌ద్దు..పాకిస్తాన్ కు నో ఛాన్స్‌, సెమీ ఫైన‌ల్ కు వెళ్లేది ఎవ‌రంటే ?

T20 World Cup 2026 Super 8: శ్రీలంక‌లో కుండ‌పోత‌..గ్రూప్ 2 మ్యాచ్ లు అన్ని ర‌ద్దు..పాకిస్తాన్ కు నో ఛాన్స్‌, సెమీ ఫైన‌ల్ కు వెళ్లేది ఎవ‌రంటే ?

T20 World Cup 2026 Super 8: T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) సూపర్ 8 మ్యాచ్ లకు ( Super 8 ) వర్షం విలన్ గా మారింది. ఇప్పటికే నిన్న జరగాల్సిన న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( New Zealand vs Pakistan) మ్యాచ్ కొలంబోలో ( R.Premadasa Stadium, Colombo) వర్షం కారణంగా నిలిచిపోయింది. రిజర్వ్ డే లేకపోవడంతో ఈ మ్యాచ్ రద్దు చేస్తూ ఐసీసీ ప్రకటన చేసింది. ఇక ఇవాళ శ్రీలంకలోని పల్లె కేలే స్టేడియం వేదికగా ( Pallekele International Cricket Stadium) మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అలాగే శ్రీలంక ( England vs Sri Lanka) తలపడతాయి. ఈ మ్యాచ్ కూడా వర్షం ( Rain) కారణంగా రద్దయ్యే ప్రమాదం ఉన్నట్టు చెబుతున్నారు. ఇవాళ పల్లె కేలే లో 70% వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ముందట. దీంతో మ్యాచ్ జరిగేది కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే.. శ్రీలంక అలాగే ఇంగ్లాండ్ కు చెరో పాయింట్ దక్కుతుంది.

Also Read: NZ vs Pak Super 8: కొంప ముంచిన వ‌ర్షం, తొలి సూప‌ర్ 8 మ్యాచ్ ర‌ద్దు..పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు

శ్రీలంక‌లో కుండ‌పోత‌..గ్రూప్ 2 మ్యాచ్ లు అన్ని ర‌ద్దు

టి20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్ లకు వర్షం విలన్ గా మారుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఇక ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరగబోయే రెండో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కాబోతుందని చర్చ జరుగుతోంది. శ్రీలంకలో ఈ నెల మొత్తం వర్షాలే ఉన్నాయట. మ్యాచ్ ఎక్కడ జరిగినా, వర్షం మాత్రం అంతరాయం కలిగించే ప్రమాదం పొంచి ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంటే గ్రూప్ 2లో జరగాల్సిన సూపర్ 8 మ్యాచ్ లు అన్నీ కూడా రద్దు కాబోతున్నాయి అన్నమాట. గ్రూప్ 2లో పాకిస్తాన్ , న్యూజిలాండ్, శ్రీలంక అలాగే ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. వర్షం పడి గ్రూప్ 2 సూపర్ 8 మ్యాచ్ లు అన్నీ కూడా రద్దు అయితే ఐసీసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం జట్లను సెమీ ఫైనల్ కు పంపించనుంది.

పాకిస్తాన్ కు ఊహించని ఎదురు దెబ్బ

వర్షం పడి అన్ని మ్యాచ్లు రద్దు అయితే, గ్రూప్ 2లో ఉన్న నాలుగు జట్లకు సమానంగా పాయింట్లు దక్కుతాయి. ఆ సమయంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం రెండు జట్లు సెమీస్ కు దూసుకువెళ్తాయి. ఈ లెక్కన శ్రీలంక అలాగే పాకిస్తాన్ రెండు కూడా ఎలిమినేట్ కావాల్సిందే. ర్యాంకింగ్స్ పరంగా ముందంజలో ఉన్న న్యూజిలాండ్ అలాగే ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా సెమీ ఫైనల్ కు దూసుకువెళ్తాయి. ఇదే విషయాన్ని ఐసీసీ చెబుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: Ban Players Coma: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఎఫెక్ట్..సంక్షోభంలో బంగ్లాదేశ్ క్రికెట్‌…కోమాలోకి వెళ్లిన‌ ఇద్ద‌రు ఆట‌గాళ్లు

 

 

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×