E-Paper
Advertisement

Trending Cars Feb 2026: MG మెజెస్టర్ To వోక్స్‌వ్యాగన్ టేరాన్.. ఫిబ్రవరి 2026 ట్రెండింగ్ కార్లు ఇవే!

Trending Cars Feb 2026:  MG మెజెస్టర్ To వోక్స్‌వ్యాగన్ టేరాన్.. ఫిబ్రవరి 2026 ట్రెండింగ్ కార్లు ఇవే!
Advertisement

Trending Cars Feb 2026 India: ఫిబ్రవరి 2026లో భారతీయ ఆటోమోటివ్ మార్కెట్ ప్రీమియం SUV లాంచ్‌ లతో ట్రెండ్ అవుతోంది. వీటిలో MG మెజెస్టర్, వోక్స్‌ వ్యాగన్ టేరాన్ లాంటి కార్లు ఈ నెలలో లాంచ్ కాబోతున్నాయి. ఈ మోడల్స్ లగ్జరీ SUV రంగంలో పోటీ పడటానికి పెద్ద, ఫీచర్ ప్యాక్డ్ 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లపై ఫోకస్ పెట్టాయి. టేరాన్ కారు లోకల్ గా అసెంబుల్ కాబోతోంది.

ఫిబ్రవరి 2026లో  ట్రెండింగ్ కార్లు

⦿ MG మెజెస్టర్: ప్రముఖ ఆటో మోబైల్ కంపెనీ ఎంజీ నుంచి మరో ప్లాగ్ షిప్ SUV విడుదలకానుంది. ఫిబ్రవరి 12, 2026న ఈ కారు అట్టహాసంగా లాంచ్ కానుంది.  చాలా రోజులుగా ఈ కారును ఇండియన్ రోడ్స్ కంపెనీ మీద టెస్ట్ చేస్తోంది. రేపు విడుదల కాబోతోంది.  పెద్ద D-సెగ్మెంట్ SUVగా మార్కెట్ కు పరిచయం కాబోతోంది. ఇది 2.0-లీటర్ డీజిల్ ఇంజన్, 4×4తో 7 సీటర్ గా ఉంటుంది. MG మెజెస్టర్ ధర ఈ కంపెనీకి చెందిన గ్లోస్టర్ కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. దీని ధర రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు విడుదల అయ్యాక ఇండియాలో టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్‌ తో పోటీ పడనుంది.

Advertisement

⦿ వోక్స్‌వ్యాగన్ టేరాన్: ఈ కారు ఫిబ్రవరి 2026 చివరలో ప్రారంభం కానుంది. ప్రీమియం 7 సీటర్ SUV, టేరాన్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 7-స్పీడ్ DSG, స్టాండర్డ్ ఆల్ వీల్ డ్రైవ్‌లను కలిగి ఉన్న టిగువాన్ ఆల్‌ స్పేస్ స్థానంలోకి రానుంది, దీనిని స్థానికంగా అసెంబుల్ చేయాలని భావిస్తున్నారు. ఇది స్థానికంగా తయారు చేయబడుతున్నందున, దీని ధర సుమారు రూ. 50 లక్షలకు పైగా  ఉంటుందని భావిస్తున్నారు.  ప్రస్తుతం దీని ప్రీ బుకింగ్‌లు రూ. 51,000 టోకెన్ మొత్తంతో ప్రారంభమయ్యాయి.

⦿ స్కోడా సూపర్బ్: ఈ కారు ఫిబ్రవరి 2026 చివరి నాటికి లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. సరికొత్త డిజైన్ తో ఈ న్యూజెనరేషన్ కారు SUVల కంటే తక్కువగా హైలైట్ చేయబడినప్పటికీ, ఇది మార్కెట్  హై ఎండ్ పోర్ట్‌ ఫోలియోలో టాప్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 54 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది విలాసవంతమైన ప్రయాణానికి,  కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉంటుంది.  ఈ కారు సస్పెన్షన్ భారతీయ రోడ్లకు తగినట్లుగా సర్దుబాటు చేయబడింది. ఇది ప్రధానంగా టయోటా క్యామ్రీ, BMW 3 సిరీస్ లాంటి కార్లతో పోటీపడుతుంది.

ఫిబ్రవరిలో కీలక లాంచ్ లు

Advertisement

ఫిబ్రవరి 2026లో ఇతర ట్రెండింగ్ కార్లను పరిశీలిస్తే, BMW X3, మారుతి సుజుకి e విటారా, టాటా సియెర్రా EV ఉన్నాయి. ఫిబ్రవరి 2026లో మార్కెట్ ట్రెండింగ్ ను పరిశీలించినట్లు అయితే, పెద్ద ఫార్మాట్ వెహికిల్స్ ఉన్నాయి. డీజిల్ తో నడిచే SUVలలో మెజెస్టర్ వంటివి, ప్రీమియం, ఫ్యామిలీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండే హై పర్ఫార్మెన్స్ టర్బో పెట్రోల్ ఎంపికల్లో టేరాన్ లాంటి కార్లు ఉన్నాయి.

Read Also: విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×